వీహెచ్‌పీ
సాక్షి, హైదరాబాద్: చైనా ఉత్పత్తులతో దేశానికి పెను ప్రమాదం పొంచి ఉందని వీహెచ్‌పీ అంతర్జాతీయ సంయుక్త కార్యదర్శి సురేంద్రకుమార్ జైన్ అన్నారు. బజరంగ్‌దళ్ మూడు రోజుల జాతీయ కార్యవర్గ సమావేశాలు శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయి. బజరంగ్‌దళ్ అంతర్జాతీయ అధ్యక్షుడు మనోజ్‌వర్మ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ సమావేశంలో సురేంద్రకుమార్ మాట్లాడుతూ గోసంరక్షణ చట్టం అమలు, లవ్ జిహాద్, మతి ప్రాతిపదికపైన రిజర్వేషన్లు, జాతీయ విద్యావిధానం, చైనా వస్తువుల బహిష్కరణ వంటి అంశాలపై ఈ సమావేశాల్లో సమగ్రంగా చర్చిస్తామన్నారు. ఈ సమావేశంలో బజరంగ్‌దళ్ రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాశ్, ఉపాధ్యక్షుడు సుభాష్ చందర్, వీహెచ్‌పీ రాష్ట్ర ప్రచారప్రముఖ్ బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.
చైనా ఉత్పత్తులతో దేశానికి ముప్పు
Published Sat, Aug 19 2017 4:27 AM | Last Updated on Tue, Sep 12 2017 12:25 AM
Advertisement
Advertisement