Surendra Kumar Jain
-
చైనా ఉత్పత్తులతో దేశానికి ముప్పు
వీహెచ్పీ సాక్షి, హైదరాబాద్: చైనా ఉత్పత్తులతో దేశానికి పెను ప్రమాదం పొంచి ఉందని వీహెచ్పీ అంతర్జాతీయ సంయుక్త కార్యదర్శి సురేంద్రకుమార్ జైన్ అన్నారు. బజరంగ్దళ్ మూడు రోజుల జాతీయ కార్యవర్గ సమావేశాలు శుక్రవారం హైదరాబాద్లో ప్రారంభమయ్యాయి. బజరంగ్దళ్ అంతర్జాతీయ అధ్యక్షుడు మనోజ్వర్మ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ సమావేశంలో సురేంద్రకుమార్ మాట్లాడుతూ గోసంరక్షణ చట్టం అమలు, లవ్ జిహాద్, మతి ప్రాతిపదికపైన రిజర్వేషన్లు, జాతీయ విద్యావిధానం, చైనా వస్తువుల బహిష్కరణ వంటి అంశాలపై ఈ సమావేశాల్లో సమగ్రంగా చర్చిస్తామన్నారు. ఈ సమావేశంలో బజరంగ్దళ్ రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాశ్, ఉపాధ్యక్షుడు సుభాష్ చందర్, వీహెచ్పీ రాష్ట్ర ప్రచారప్రముఖ్ బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. -
‘పాక్ పై దండెత్తడానికి ఇదే సరైన సమయం’
న్యూఢిల్లీ: పాకిస్థాన్ కు గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని విశ్వహిందూ పరిషత్(వీహెచ్ పీ) పేర్కొంది. దాయాది దేశంపై దాడి చేసి పాక్ ఆక్రమిత కశ్మీర్ తిరిగి తెచ్చుకోవాలని వీహెచ్ పీ అంతర్జాతీయ సంయుక్త కార్యదర్శి సురేంద్ర కుమార్ జైన్ అన్నారు. పాకిస్థాన్ తో యుద్ధానికి పార్లమెంట్ లో తీర్మానం ఆమోదించడానికి ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. ‘పాకిస్థాన్ పై భారత్ దాడి చేయాలి. పీఓకేను స్వాధీనం చేసుకోవాలి. ఇది భారత న్యాయమైన హక్కు. పాక్ ఆక్రమిత కశ్మీర్ మనదే. దీనికి అనుగుణంగా పార్లమెంట్ లో తీర్మానం ఆమోదించాల’ని జైన్ వ్యాఖ్యానించారు. యూరి సైనిక స్థావరంపై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో పాకిస్థాన్ వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా స్పందన వ్యక్తమవుతోందని చెప్పారు. పాకిస్థాన్ ఇప్పుడు ఒంటరైందని, పొరుగుదేశంపై దండెత్తడానికి ఇదే సరైన సమయమన్నారు.