వంకర బుద్ధి మార్చుకోని చైనా
బీజింగ్ : బ్రహ్మపుత్ర నదికి సంబంధించిన ఎటువంటి సమాచారాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌తో పంచుకోవడం కుదరదని చైనా మంగళవారం తేల్చి చెప్పింది. అయితే భారత్‌తో చర్చలు జరిపేందుకు తామెప్పడూ సిద్దమేనని బీజింగ్ తెలిపింది. డోక్లామ్ సమస్య ఉత్పన్నమైన సమయంలో సిక్కిం సరిహద్దులో మూసేసిన నాథూలా పాస్‌ను తిరిగి తెరించేందుకు సిద్ధమని.. భారత్ ముందుకు వస్తే తమకు అభ్యంతరం లేదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి గెంగ్ షువాంగ్ తెలిపారు.
నాథూలా పాస్‌ని తిరిగి తెరిస్తే కైలాస్, మానస సరోవర యాత్ర చేసే భక్తులకు ఉపయోగకరంగా ఉంటుందనే అభిప్రాయాన్నిఆయన వ్యక్తం చేశారు. బ్రహ్మపుత్ర నదీ జలాలకు సంబంధించిన సమచారం కోసం భారత్‌ను ఎన్నిసార్లు అభ్యర్థించినా.. స్పందించలేదని దీంతో తాము కూడా నదీజలాల సమాచారాన్ని అందివ్వలేమని చెప్పారు.