సింధు రక్షక్ ప్రమాద ఘటనపై కేసు నమోదు | Mumbai Police register accidental death case in connection with Sindhurakshak tragedy | Sakshi
Sakshi News home page

సింధు రక్షక్ ప్రమాద ఘటనపై కేసు నమోదు

Published Fri, Aug 16 2013 6:36 PM | Last Updated on Fri, Sep 1 2017 9:52 PM

Mumbai Police register accidental death case in connection with Sindhurakshak tragedy

ముంబై: గత మంగళవారం ప్రమాదానికి గురైన జలాంతర్గామి సింధు రక్షక్ ఘటనపై కేసు నమోదైంది. సింధు రక్షక్‌లో అకస్మికంగా మంటలు వ్యాపించి భారీ ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ముంబై పోలీసులు ప్రమాదపు కేసును నమోదు చేశారు.

 

 ఎన్ఎస్ సింధురక్షక్‌ నుంచి నాలుగు మృతదేహాలను నేవీ అధికారులు శుక్రవారం వెలికి తీశారు. మిగతా మృతదేహాల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. ముంబై నేవీ డాక్‌యార్డ్‌లో జరిగిన ఈ దుర్ఘటనలో 18 మంది దుర్మరణం చెందినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురయిన జలాంతర్గామి ఐఎన్ఎస్ సింధురక్షక్‌ లోపలకి  నేవీ డైవర్లు వెళ్లలేకపోతున్నారు.

సబ్‌మెరైన్‌ చీకటిగా ఉండడం, నీళ్లతో పూర్తిగా నిండిపోవడంతో లోపలికి వెళ్లేందుకు తీవ్ర అడ్డంకి ఏర్పడుతోంది. దీనికి తోడు భారీ విస్ఫోటంతో లోపలి భాగాలన్నీ వేడితో కరిగిపోయాయి. దీంతో కంపార్ట్‌మెంట్లలోకి వెళ్లే దారులు మూసుకుపోయాయి. భారీ పంపులతో నీటిని బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారు.


గాలింపు చర్యలకు అంతరాయం కలుగుతోందని మాత్రమే నేవీ చెబుతోంది. మరోవైపు తమ వారి కోసం నావికుల కుటుంబీకులు మాత్రం ఆశగా ఎదురుచూస్తున్నారు. సింధు రక్షక్‌లో ప్రమాదం జరగడం రెండేళ్లలో ఇది రెండోసారి. గతంలో జరిగిన పేలుడులో ఓ నావికుడు చనిపోగా, ఇద్దరు గాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement