‘బ్రహ్మోస్’ పరీక్ష సక్సెస్ | "Brahmos" Test Success | Sakshi
Sakshi News home page

‘బ్రహ్మోస్’ పరీక్ష సక్సెస్

Published Sun, Feb 15 2015 2:37 AM | Last Updated on Sat, Sep 2 2017 9:19 PM

‘బ్రహ్మోస్’ పరీక్ష సక్సెస్

‘బ్రహ్మోస్’ పరీక్ష సక్సెస్

న్యూఢిల్లీ: నేవీ  కొత్త యుద్ధనౌక ‘ఐఎన్‌ఎస్ కోల్‌కతా’ నుంచి శనివారం బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్షిపణిని గోవా తీరంలో విజయవంతంగా పరీక్షించారు. ధ్వని కంటే 1.4 రెట్ల వేగం(సెకనుకు 343 మీటర్లు)తో దూసుకెళ్లే ఈ క్షిపణి 290 కి.మీ.ల పరిధిలోని లక్ష్యాలను ధ్వంసం చేయగలదు. ఈ క్షిపణి సైన్యం, నేవీల్లోకి ఇదివరకే చేరింది. యుద్ధవిమానాల నుంచి సైతం దూసుకెళ్లే బ్రహ్మోస్ క్షిపణి తుదిదశ అభివృద్ధిలో ఉంది. ఐఎన్‌ఎస్ కోల్‌కతా  2014లో నేవీ అమ్ములపొదికి చేరింది. మిగతా యుద్ధనౌకల ద్వారా ఒకేసారి 8 బ్రహ్మోస్ క్షిపణుల ప్రయోగించేందుకు వీలుండగా..దీన్నుంచి 16 బ్రహ్మోస్‌లను ప్రయోగించొచ్చు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement