► పసిఫిక్ మహా సముద్రంలోని దక్షిణ చైనా సముద్రంపై గత కొన్నేళ్లుగా వివాదం నెలకొంది. చైనా ఈ ప్రాంతంపై తన సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకోవడాన్ని సముద్రం చుట్టూ ఉన్న దేశాలు తీవ్రంగా నిరసిస్తున్నాయి. దక్షిణ చైనా సముద్రం కేవలం డ్రాగన్‌దేనంటే ఊరుకోబోమని అందులో తమకూ భాగం ఉందని గళమెత్తుతున్నాయి. అలాంటి దేశాల్లో వియత్నాం కూడా ఒకటి. చైనా పొరుగునే ఉన్న వియత్నాం ఇండో పసిఫిక్ ప్రాంతంలో మనకి అత్యంత కీలక భాగస్వామిగా ఉంది. భావసారూప్యత కలిగిన భాగస్వామ్య దేశమైన వియత్నాం నౌకాదళ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ దేశ ఆధిపత్యానికి చెక్ పెట్టాలన్నది భారత్ వ్యూహంగా ఉంది. దక్షిణ చైనా సముద్రంపై చైనా పెత్తనం పెరుగుతున్న కొద్దీ ప్రపంచ పటంలో కొత్త మార్పులు వస్తాయన్న ఆందోళనలున్నాయి.
ఇటీవల కాలంలో వియత్నాంతో మన దేశానికి ద్వైపాక్షిక సంబంధాలు బలపడుతున్నాయి. రక్షణ రంగంలో సహకరించుకుంటున్నాం. దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ దేశ పెత్తనం సహించలేనిదిగా మారింది. ఈ నేపథ్యంలో వియత్నాం రక్షణ మంత్రి జనరల్ ఫాన్ వాన్ జియాంగ్ భారతదేశ పర్యటనకు వచి్చనçప్పుడు ఈ యుద్ధ నౌకను కానుకగా ఇవ్వాలని భారత్ నిర్ణయించింది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. ఇప్పటివరకు భారత్ ఎన్నో మిత్ర దేశాలకు మిలటరీ సాయాలు చేసింది. మాల్దీవులు, మారిషస్ వంటి దేశాలకు చిన్న చిన్న పడవలు, మిలటరీ పరికరాలు ఇచి్చంది. మయన్మార్‌కు ఒక జలాంతర్గామిని ఇచి్చంది. కానీ వియత్నాంకు క్షిపణిని మోసుకుపోగలిగే సామర్థ్యమున్న యుద్ధ నౌకను ఇవ్వడం వల్ల ఆ తీరంలో చైనా కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఏర్పాటు చేయడానికి వీలు కలుగుతుందన్నది భారత్ ఉద్దేశంగా ఉంది.
ప్రత్యేకతలివే..!
► ఐఎన్‌ఎస్ కృపాణ్ ఖుక్రీ క్లాస్‌కు చెందిన అతి చిన్న క్షిపణి యుద్ధనౌక. 1,350 టన్నుల బరువైన, సముద్రజలాలను పక్కకు తోసేస్తూ వేగంగా ముందుకు దూసుకెళ్లగల శక్తివంతమైన నౌక ఇది.
► పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్, ఇంజనీర్లు రూపొందించిన ఈ నౌక గత కొన్నేళ్లుగా మన నావికా దళానికి గర్వకారణంగా ఉంది.
► 1991 జనవరి 12న దీనిని నావికాదళంలోకి ప్రవేశపెట్టారు.. 25 నాట్స్ వేగంతో
ప్రయాణించగలదు.
► మీడియం రేంజ్ గన్స్ అంటే 30 ఎంఎం తుపాకీలను ఈ నౌకకు అమర్చవచ్చు. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణులు, చాఫ్ లాంచర్స్ వంటి వైవిధ్యమైన పనులు చేయగలదు.
► తీరప్రాంతాల్లో భద్రత, గస్తీ, కదనరంగంలో పాల్గొనడం, యాంటీ పైరసీ, విపత్తు సమయాల్లో మానవతా సాయం వంటివి చేయగల సామర్థ్యముంది.
► భారత్ నావికాదళంలో చురుగ్గా సేవలు అందిస్తున్న యుద్ధనౌక ఐఎన్‌ఎస్ కృపాణ్‌ను కేంద్ర ప్రభుత్వం వియత్నాంకు కానుకగా ఇచ్చింది. విదేశాలకు ఒక నౌకని బహుమతిగా ఇవ్వడం దేశ చరిత్రలో ఇదే మొదటి సారి. ఈ నౌక విశాఖ నుంచి ఈ నెల 28 బుధవారం వియత్నాంకు బయల్దేరి వెళ్లింది. 2016 నుంచి భారత్, వియత్నాం మధ్య సంబంధాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇప్పటివరకు మనం ఎన్నో దేశాలకు మిలటరీ సాయం చేశాము. కానీ కోట్లాది రూపాయల విలువ చేసే యుద్ధ నౌకను ఇప్పటివరకు ఎవరికీ ఇవ్వలేదు ? ఎందుకీ నిర్ణయం? దీని వల్ల భారత్‌కు ఒరిగేదేంటి ?
దక్షిణ చైనా సముద్రం వివాదమేంటి?
► దక్షిణ చైనా సముద్రంపై సుదీర్ఘకాలంగా వివాదం నడుస్తోంది. ఈ సముద్ర భూభాగంపై సార్వ¿ౌమాధికారాన్ని ప్రకటించుకున్న చైనా ఏకంగా కృత్రిమ దీవులను నిర్మిస్తోంది. ఈ సముద్రంలో ఎన్నో దీవులున్నాయి. మత్స్య సంపద అపారంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా చేపల ఉత్పత్తిలో 15 శాతం ఈ సముద్రంలో జరుగుతుంది. దీనిపై చైనా సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకోవడం ఇతర దేశాలకు మింగుడు పడడం లేదు.ఈ సముద్రంలో ఉన్న అన్ని ద్వీపాలను ఒకే రేఖ మీద చూపిస్తూ చైనా విడుదల చేసిన ‘‘నైన్ డ్యాష్ లైన్’ మ్యాప్‌తో తనవేనని వాదిస్తోంది.
ఈ సముద్రంలో భారీగానున్న చమురు నిల్వలపై అన్వేషణ కూడా ప్రారంభం కావడంతో దేశాల మధ్య పోటీ ఎక్కువైంది. హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహా సముద్రం మధ్యలో దక్షిణ చైనా సముద్రం ఉండడం వల్ల అక్కడ చైనా జోక్యం పెరిగితే భారత్‌కూ నష్టమే. ఈ సముద్రం చుట్టూ చైనా, తైవాన్, వియత్నాం, మలేసియా, ఇండోనేసియా, బ్రూనై, ఫిలిప్పీన్స్ దేశాలున్నాయి. ఇవి కూడా సముద్రంలో తమకూ వాటా ఉందని ప్రకటించాయి. మరోవైపు చైనా కృత్రిమ దీవులు, సైనిక స్థావరాలతో ఉద్రిక్తతలు చెలరేగుతూనే ఉన్నాయి. ఈ పరిణామాల మధ్య మనం పంపిన కృపాణ్ దక్షిణ చైనా జలాల్లో ఎంత మేరకు నిఘా పెడుతూ డ్రాగన్‌కు చెక్ పెడుతుందో వేచిచూడాలి.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment