హైదరాబాద్: టీఎన్జీవో రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో టీఎన్జీవో నూతన అధ్యక్షుడిగా రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా హమీద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటివరకు టీఎన్జీవో అధ్యక్షుడిగా ఉన్న దేవీప్రసాద్ ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించి ఎమ్మెల్సీగా ఎన్నికైనందున ఆయన స్థానంలో నూతన అధ్యక్షుని ఎన్నిక అనివార్యమైంది.