జైపూర్: గత ఐపీఎల్‌లో సొంతగడ్డపై ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని రికార్డును... చాంపియన్స్ లీగ్‌లోనూ రాజస్థాన్ రాయల్స్ కొనసాగిస్తోంది. వరుసగా రెండో మ్యాచ్‌లో గెలిచి సెమీస్‌కు చేరువయింది. మాన్‌సింగ్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ద్రవిడ్ సేన 30 పరుగుల తేడాతో హైవీల్డ్ లయన్స్‌పై గెలిచింది. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. కెప్టెన్ ద్రవిడ్ (30 బంతుల్లో 31; 5 ఫోర్లు), వాట్సన్ (24 బంతుల్లో 33; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. స్టువర్ట్ బిన్నీ (20 బంతుల్లో 38; 5 ఫోర్లు, 1 సిక్సర్), బ్రాడ్ హాడ్జ్ (23 బంతుల్లో 46 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగి ఆడి జట్టుకు భారీ స్కోరు అందించారు.
లయన్స్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసి ఓడిపోయింది. కెప్టెన్ అల్విరో పీటర్సన్ (28 బంతుల్లో 40; 4 ఫోర్లు) మినహా బ్యాట్స్‌మెన్ అంతా విఫలమయ్యారు. రాజస్థాన్ స్పిన్నర్ ప్రవీణ్ తాంబె (4/15) నాలుగు వికెట్లతో రాణించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కించుకున్నాడు.
స్కోరు వివరాలు
రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్: ద్రవిడ్ (సి) పీటర్సన్ (బి) ప్రిటోరియస్ 31; రహానే (సి) విజియోన్ (బి) తన్వీర్ 6; శామ్సన్ (సి) సొలెకిలె (బి) సోట్‌సోబ్ 12; వాట్సన్ (సి) సెమైస్ (బి) సోట్‌సోబ్ 33; బిన్నీ (బి) ప్రిటోరియస్ 38; హాడ్జ్ నాటౌట్ 46; మేనరియా నాటౌట్ 6; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో ఐదు వికెట్లకు) 183.
వికెట్ల పతనం: 1-21; 2-36; 3-67; 4-110; 5-145.
బౌలింగ్: సోట్‌సోబ్ 4-0-26-2; తన్వీర్ 4-0-36-1; విజియోన్ 4-0-41-0; ప్రిటోరియస్ 4-0-27-2; ఫాంగిసో 4-0-52-0.
హైవీల్డ్ లయన్స్ ఇన్నింగ్స్: వాన్‌డెర్ డుసెన్ (సి) ద్రవిడ్ (బి) మాలిక్ 14; డి కాక్ (సి) మేనరియా (బి) వాట్సన్ 18; బవుమా (సి) శామ్సన్ (బి) మాలిక్ 0; విజియోన్ (బి) తాంబె 24; పీటర్సన్ (బి) తాంబె 40; సెమైస్ (సి) బిన్నీ (బి) తాంబె 3; తన్వీర్ ఎల్బీడబ్ల్యు (బి) తాంబె 0; సొలెకిలె (బి) ఫౌల్కనర్ 21; ప్రిటోరియస్ (సి) హాడ్జ్ (బి) ఫాల్క్‌నర్ 19; ఫాంగిసో నాటౌట్ 4; సోట్‌సోబ్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 153.
వికెట్ల పతనం: 1-25; 2-36; 3-36; 4-89; 5-101; 6-101; 7-120; 8-137; 9-152.
బౌలింగ్: విక్రమ్‌జీత్ మాలిక్ 3-0-26-2; ఫౌల్కనర్ 4-0-22-2; వాట్సన్ 4-0-27-1; బిన్నీ 2-0-17-0; కూపర్ 4-0-39-0; ప్రవీణ్ తాంబె 3-0-15-4.
చాంపియన్స్ లీగ్‌లో నేడు
చెన్నై x సన్‌రైజర్స్
రా. గం. 8.00 నుంచి
వేదిక: రాంచీ
స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
ఎదురులేని రాయల్స్
Published Thu, Sep 26 2013 12:58 AM | Last Updated on Fri, Sep 1 2017 11:02 PM
Advertisement
Advertisement