సెమీస్లో ముంబయి ఇండియన్స్
చాంపియన్స్ లీగ్ టి-20 టోర్నీలో ముంబయి ఇండియన్స్ సెమీస్కు అర్హత సాధించింది. బుధవారమిక్కడ పెర్త్ స్కార్చర్స్తో జరిగిన గ్రూప్-ఎ మ్యాచ్లో ముంబయి ఆరు వికెట్లతో ఘనవిజయం సాధించి బెర్తు సొంతం చేసుకుంది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి నాలుగు వికెట్లు కోల్పోయి మరో 40 బంతులు మిగిలుండగా అలవోకగా విజయతీరాలకు చేరింది. రోహిత్ శర్మ (24 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 నాటౌట్), డ్వెన్ స్మిత్ (25 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 48) మెరుపులు మెరిపించారు. పొలార్డ్ 23, అంబటి రాయుడు 14 (నాటౌట్) పరుగులు చేశారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పెర్త్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లకు 149 పరుగులు చేసింది. వైట్మన్ (32 బంతుల్లో 51 నాటౌట్) దూకుడుగా ఆడగా, అగర్ (35), కార్ట్రైట్ (28) ఆకట్టుకున్నారు. ముంబయి బౌలర్లు కల్టర్ నిలె మూడు, ప్రజ్ఞాన్ ఓజా రెండు వికెట్లు తీశారు. రోహిత్కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది.