
ముంబై: ఐపీఎల్ టి20 క్రికెట్ టోర్నీ వాయిదా అనంతరం ఆటకు దూరంగా కుటుంబ సభ్యులు, స్నేహితులతో సరదాగా గడుపుతున్న భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని మళ్లీ మైదానంలోకి దిగాడు. అయితే అది క్రికెట్ పిచ్‌పై కాదు. తాను ఎంతో ఇష్టపడే ఫుట్‌బాల్ గ్రౌండ్ లో అతను సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు నిధుల సేకరణ కోసం త్వరలోనే నిర్వహించనున్న ‘ఆల్ స్టార్స్’ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ధోని ఆడనున్నాడు. దీని కోసం సాధన చేస్తున్న అతను, బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్‌తో కలిసి ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. ధోనిని కలవడం తన అదృష్టంగా భావిస్తున్నానని రణ్‌వీర్ వ్యాఖ్యానించగా... వీరిద్దరి మధ్య మైదానంలో చాలా సేపు సరదా సంభాషణ సాగింది. మరో భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ కూడా ఇక్కడే ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment