లండన్: ఇంగ్లండ్ ఫుట్‌బాల్ ఆటగాడు హారీకేన్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి చేసిన ప్రతిపాదనపై ఆర్సీబీ స్పందించింది. ‘‘నీ కోసం ఇప్పుడే జెర్సీ నంబరు 10 సిద్ధం చేసి పెట్టాం’’ అంటూ అతడికి బదులిచ్చింది. టోటన్‌హాం హాట్‌స్పర్ క్లబ్ ఆటగాడు, ఇంగ్లండ్ జాతీయ జట్టు కెప్టెన్ హారీకేన్ సహచర ఆటగాళ్లతో కలిసి సరాదాగా క్రికెట్ ఆడాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో శుక్రవారం షేర్ చేశాడు. మ్యాచ్ విన్నింగ్ టీ20 ఇన్నింగ్స్ ఆడానని, ఐపీఎల్ టీం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో తనకు చోటు దొరుకుతుందా అంటూ సారథి కోహ్లిని అడిగాడు.(చదవండి: ఆ మూడు తప్పిదాలతోనే టీమిండియా మూల్యం!)
వచ్చే ఏడాది అయినా తనను జట్టులోకి తీసుకునే అంశాన్ని పరిశీలించాలంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. ఇక ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్‌లో బిజీగా ఉన్న కోహ్లి ఈ విషయంపై తాజాగా స్పందించాడు. బ్యాటింగ్ నైపుణ్యం బాగుందని, కౌంటర్ అటాక్ బ్యాట్స్‌మెన్‌గా ఆర్సీబీలో స్థానం కల్పిస్తామేమో అంటూ కామెంట్ చేశాడు. అదే విధంగా ఇంగ్లండ్ క్రికెటర్, రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్ సైతం ఈ వీడియోపై స్పందించాడు. బాగా ఆడుతున్నావని, 2021 ఐపీఎల్ వేలంలో పాల్గొనాల్సిందిగా ఈ స్ట్రైకర్‌కు సూచించాడు. కాగా 27 ఏళ్ల హారికేన్ ఈ ఏడాది ప్రీమియర్ లీగ్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఏడు గోల్స్ చేసిన అతడు.. 20 పాయింట్లతో టోటన్‌హాం జట్టును అగ్రస్థానంలో నిలపడంలో కీలక పాత్ర పోషించాడు.
Haha good skills mate. Maybe we can get you in as a counter attacking batsman😃👏 @HKane https://t.co/rYjmVUkdwO
— Virat Kohli (@imVkohli) November 28, 2020
Comments
Please login to add a commentAdd a comment