అఫ్గన్‌ చేతిలో పాక్‌ చిత్తు | Afghanistan register a historic win against Pakistan | Sakshi
Sakshi News home page

అఫ్గన్‌ చేతిలో పాక్‌ చిత్తు

Published Sun, Mar 26 2023 6:02 AM | Last Updated on Sun, Mar 26 2023 6:02 AM

Afghanistan register a historic win against Pakistan - Sakshi

షార్జా: అంతర్జాతీయ క్రికెట్‌లో పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్‌ ఆడిన పుష్కరకాలం తర్వాత అఫ్గనిస్తాన్‌కు ఆ జట్టుపై మొదటి విజయం దక్కింది. శుక్రవారం జరిగిన తొలి టి20లో అఫ్గన్‌ 6 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. ముందుగా పాకిస్తాన్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది.

అనంతరం అఫ్గనిస్తాన్‌ 17.5 ఓవర్లలో 4 వికెట్లకు 98 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మొహమ్మద్‌ నబీ (38 బంతుల్లో 38 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) అఫ్గన్‌ను గెలిపించాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement