టైటాన్స్‌కు తొలి విజయం
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు బోణీ చేసింది. వరుసగా మూడు పరాజయాల తర్వాత సమష్టిగా చెలరేగి సీజన్‌లో తొలి విజయాన్ని అందుకుంది. సోమవారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 35-18 తేడాతో బెంగాల్ వారియర్స్‌ను చిత్తు చేసింది. టైటాన్స్ తరఫున రాహుల్ 10 రైడింగ్ పాయింట్లు స్కోర్ చేయగా, అద్భుతమైన ఆటతీరు కనబర్చిన డిఫెండర్ సందీప్ ధుల్ 8 టాకిల్ పాయింట్లు సాధించి సత్తా చాటాడు.
వరుసగా మూడు పరాజయాల తర్వాత టైటాన్స్ ఒక్క సారిగా జూలు విదిల్చింది. మ్యాచ్ ఆరంభం కాగానే ప్రత్యర్థికి ఒక్క పాయింట్ కూడా ఇవ్వకుండా వరుసగా ఆరు పాయింట్లు సాధించిన జట్టు ఆ తర్వాత వారియర్స్‌ను ఆలౌట్ చేసి ఏకంగా 10-1 ఆధిక్యంలోకి దూసుకుపోయింది. తొలి అర్ధ భాగం ముగిసే సరికి టైటాన్స్ 15-8తో పైచేయి సాధించింది. రెండో అర్ధ భాగంలో టైటాన్స్ డిఫెన్స్ మరింత సమర్థవంతంగా పని చేసింది. మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 29-27 స్కోరుతో పుణేరీ పల్టన్‌ను ఓడించింది.
ప్రొ కబడ్డీలో నేటి మ్యాచ్‌లు
తెలుగు టైటాన్స్ X బెంగళూరు బుల్స్
రాత్రి 8 గంటల నుంచి
ఫైర్ బర్డ్స్ X స్టార్మ్ క్వీక్స్(మహిళల మ్యాచ్)
రాత్రి 9 గంటల నుంచి
స్టార్ స్పోర్ట్స్2లో ప్రత్యక్ష ప్రసారం