
ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు తమ 11వ మ్యాచ్‌లో ఎట్టకేలకు తొలి గెలుపు రుచి చూసింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 35–34తో జైపూర్ పింక్ పాంథర్స్‌ను ఓడించింది. టైటాన్స్ స్టార్ రెయిడర్ రజనీశ్ ఎనిమిది పాయింట్లు... మరో రెయిడర్ ఆదర్శ్ తొమ్మిది పాయింట్లు సాధించారు. జైపూర్ తరఫున అర్జున్ 13 పాయిం ట్లు స్కోరు చేశాడు. టైటాన్స్ ప్రస్తుతం 17 పాయింట్లతో చివరిదైన 12వ స్థానంలో ఉంది. మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 37–30తో పుణేరి పల్టన్‌పై గెలిచింది.
Comments
Please login to add a commentAdd a comment