
Pro Kabaddi League Telugu Titans 11th Defeat- జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్‌లో తెలుగు టైటాన్స్ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. జైపూర్ పింక్ పాంథర్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 35–38తో పోరాడి ఓడిపోయింది. ఈ లీగ్‌లో టైటాన్స్‌కిది 11వ ఓటమి కావడం గమనార్హం.
టైటాన్స్ తరఫున కెప్టెన్ పవన్ సెహ్రావత్ 12 పాయింట్లు స్కోరు చేయగా... సందీప్ ధుల్, రాబిన్ 5 పాయింట్ల చొప్పున సాధించారు. జైపూర్ తరఫున అర్జున్ దేశ్వాల్ అత్యధికంగా 14 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
మరో మ్యాచ్‌లో పుణేరి పల్టన్ 37–17తో గుజరాత్ జెయింట్స్‌ను ఓడించింది. పుణేరి పల్టన్ కెప్టెన్ అస్లమ్ ముస్తఫా 10 పాయింట్లు సాధించాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో జైపూర్ పింక్ పాంథర్స్‌తో పుణేరి పల్టన్; యూపీ యోధాస్‌తో బెంగాల్ వారియర్స్ తలపడతాయి.
చదవండి: Ind vs Eng: ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు భారత్ జట్టు ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment