
జైపూర్: తెలుగు టైటాన్స్‌ను సిద్ధార్థ్ దేశాయ్ గెలిపించాడు. ఏకంగా 22 పాయింట్లతో చెలరేగిన అతను జట్టుకు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 51–31తో జైపూర్ పింక్ పాంథర్స్‌ను చిత్తు చేసింది. సిద్ధార్థ్‌కు తోడు రజ్‌నీశ్ దలాల్ సూపర్ టెన్ (11 పాయింట్లు), ట్యాక్లింగ్‌లో ఫర్హాద్ మిలాఘర్దాన్ (4 పాయింట్లు) ఆకట్టుకున్నారు. మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 35–33తో యు ముంబాపై గెలుపొందింది. పవన్ షెరావత్ 11 పాయింట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. నేటి మ్యాచ్‌ల్లో హరియాణా స్టీలర్స్‌తో యూపీ యోధ; గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌తో తమిళ్ తలైవాస్ తలపడతాయి.