
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ జట్టుకు 16వ పరాజయం ఎదురైంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 35–54 పాయింట్ల తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్ చేతిలో ఓటమి చవిచూసింది. తెలుగు టైటాన్స్ తరఫున ఆడుతున్న తెలంగాణ ప్లేయర్ గల్లా రాజు రెడ్డి అద్భుత రెయిడింగ్‌తో ఆకట్టుకున్నాడు. జోగులాంబ గద్వాల్ జిల్లాకు చెందిన రాజు తొమ్మిది పాయింట్లు స్కోరు చేసి టైటాన్స్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఈ లీగ్‌లో ఇప్పటివరకు 21 మ్యాచ్‌లు ఆడిన తెలుగు టైటాన్స్ ఒక మ్యాచ్‌లో నెగ్గి, నాలుగు మ్యాచ్‌లను ‘టై’ చేసుకొని 16 మ్యాచ్‌ల్లో ఓడి 27 పాయింట్లతో చివరిదైన 12వ స్థానంలో ఉంది. మరో మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 52–21తో తమిళ్ తలైవాస్‌పై గెలిచింది.
Comments
Please login to add a commentAdd a comment