ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో డిఫెండింగ్ చాంపియన్.. స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్(ప్రపంచ రెండో ర్యాంకర్) పోరు ముగిసింది. 23వ గ్రాండ్‌స్లామ్ అందుకోవాలన్న కల తీరకుండానే నాదల్ రెండో రౌండ్‌లో ఇంటిముఖం పట్టాడు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో భాగంగా బుధవారం నాదల్.. అమెరికాకు చెందిన అన్‌సీడెడ్ మెకంజీ మెక్‌డొనాల్డ్ చేతిలో 4-6,4-6,5-7 స్కోర్‌తో ఓటమి పాలయ్యాడు.
నాదల్ నిష్రమణకు గాయం కూడా ఒక కారణం. ఎడమకాలికి గాయం అయినప్పటికి బై ఇవ్వడానికి ఇష్టపడని నాదల్ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. నొప్పితో సరిగా ఆడలేకపోవడంతో మెకంజీ తొలి రెండు సెట్లు ఈజీగా గెలిచేశాడు. మూడోసెట్ ఆడుతుండగా నాదల్ మరోసారి గాయంతో ఇబ్బంది పడ్డాడు. అప్పటికే మెకంజీ మూడో సెట్‌లో 7-5తో స్పష్టమైన ఆధిక్యంలో నిలవడంతో నాదల్ సర్వీస్ చేయకుండా పక్కకు తప్పుకున్నాడు. దీంతో మెకంజీ మెక్‌డొనాల్డ్ మూడోరౌండ్‌లో అడుగుపెట్టాడు.
Mission accomplished for @mackiemacster 🇺🇸
— #AusOpen (@AustralianOpen) January 18, 2023
The impressive American has beaten Nadal 6-4 6-4 7-5. @wwos • @espn • @eurosport • @wowowtennis • #AusOpen • #AO2023 pic.twitter.com/fkaTpk11te
Always a pleasure, @RafaelNadal 🫶#AusOpen • #AO2023 pic.twitter.com/CdnOMzYDK0
— #AusOpen (@AustralianOpen) January 18, 2023
Comments
Please login to add a commentAdd a comment