టురిన్ (ఇటలీ): సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ రికార్డుస్థాయిలో ఎనిమిదోసారి ఏడాదిని నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించనున్నాడు. సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్ తొలి లీగ్ మ్యాచ్‌లో జొకోవిచ్ 7–6 (7/4), 6–7 (1/7) 6–3తో హోల్గర్ రూనె (డెన్మార్క్)పై గెలిచి 2023 సీజన్ ముగింపు ‘టాప్’ ర్యాంక్‌ను ఖరారు చేసుకున్నాడు.
36 ఏళ్ల జొకోవిచ్ రెండేళ్ల క్రితమే ఏడోసారి సీజన్‌ను నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించి సంప్రాస్ (అమెరికా; 6 సార్లు) పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. జొకోవిచ్ 2011, 2012, 2014, 2015, 2018, 2020, 2021లలో నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించాడు. ఏటీపీ ఫైనల్స్ ముగిశాక జొకోవిచ్ ఓవరాల్‌గా ఏటీపీ ర్యాంకింగ్స్ లో 400 వారాలు నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచిన తొలి ప్లేయర్‌గా గుర్తింపు పొందనున్నాడు.
సీజన్ ముగింపు
నంబర్‌వన్ ర్యాంక్ ట్రోఫీతో జొకోవిచ్
Comments
Please login to add a commentAdd a comment