Astana Open 2022: జొకోవిచ్‌ ఖాతాలో 90వ టైటిల్‌   | Novak Djokovic Defeats Stefanos Tsitsipas, Triumphs In Astana | Sakshi
Sakshi News home page

Astana Open 2022: జొకోవిచ్‌ ఖాతాలో 90వ టైటిల్‌  

Published Mon, Oct 10 2022 10:09 AM | Last Updated on Mon, Oct 10 2022 10:09 AM

Novak Djokovic Defeats Stefanos Tsitsipas, Triumphs In Astana - Sakshi

సెర్బియా టెన్నిస్‌ దిగ్గజం జొకోవిచ్‌ వారం వ్యవధిలో రెండో టైటిల్‌ను సాధించాడు. గతవారం టెల్‌ అవీవ్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచిన ఈ మాజీ నంబర్‌వన్‌ తాజాగా అస్తానా ఓపెన్‌ టోర్నీ టైటిల్‌ నెగ్గాడు.

కజకిస్తాన్‌లో ఆదివారం జరిగిన ఫైనల్లో జొకోవిచ్‌ 6–3, 6–4తో సిట్సిపాస్‌ (గ్రీస్‌)పై గెలిచాడు. ఈ సీజన్‌లో జొకోవిచ్‌కిది నాలుగో టైటిల్‌కాగా కెరీర్‌లో 90వ టైటిల్‌. విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 3,55,310 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 కోట్ల 94 లక్షలు) దక్కింది.
చదవండివెర్‌స్టాపెన్‌దే ప్రపంచ టైటిల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement