
మహిళల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) తొలిసారి విజేతగా నిలిచి మళ్లీ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. మెక్సికోలో మంగళవారం జరిగిన ఫైనల్లో స్వియాటెక్ 6–1, 6–0తో ఐదో ర్యాంకర్ జెస్సికా పెగూలా (అమెరికా)ను ఓడించింది. స్వియాటెక్ కు ట్రోఫీతోపాటు 30,78,000 డాలర్ల (రూ. 25 కోట్ల 62 లక్షలు) ప్రైజ్‌మనీ, రన్నరప్ పెగూలాకు 16,02,000 డాలర్ల (రూ. 13 కోట్ల 33 లక్షలు) ప్రైజ్‌మనీ దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment