
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) పురుషుల డబుల్స్ ర్యాంకింగ్స్‌లో భారత్‌కు చెందిన సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో సాత్విక్–చిరాగ్ జోడీ ఒక స్థానం మెరుగుపర్చుకొని 95,861 పాయింట్లతో టాప్ ర్యాంక్‌కు ఎగబాకింది.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాత్విక్ ... మహారాష్ట్ర ప్లేయర్ చిరాగ్ శెట్టి ఈ ఏడాది జరిగిన రెండు ప్రధాన టోరీ్నల్లోనూ (మలేసియా ఓపెన్–1000, ఇండియా ఓపెన్–750) అద్భుత ప్రతిభ కనబరిచి రన్నరప్‌గా నిలిచారు. గత ఏడాది అక్టోబర్‌లో ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించాక సాత్విక్ –చిరాగ్ తొలిసారి వరల్డ్ నంబర్‌వన్‌గా అవతరించింది. పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో ప్రణయ్ ఒక స్థానం పురోగతి సాధించి ఎనిమిదో ర్యాంక్‌లో నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment