icc test bowler rankings
-
వారం మురిపమే.. అండర్సన్‌తో సంయుక్తంగా
ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్ సీమ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. గత వారం రోజులుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న అశ్విన్.. ఇప్పుడు అండర్సన్‌తో కలిసి అగ్రస్థానాన్ని పంచుకున్నాడు. ఆస్ట్రేలియాతో మూడో టెస్టు మ్యాచ్‌లో నాలుగు వికెట్లు మాత్రమే తీసిన అశ్విన్ ఆరు ర్యాంకింగ్ పాయింట్లు కోల్పోయాడు. దీంతో అశ్విన్, అండర్సన్ ఇద్దరూ 859 ర్యాంకింగ్ పాయింట్లతో సంయుక్తంగా టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నారు. అయితే గత కొంతకాలంగా ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అశ్విన్, అండర్సన్, ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మధ్య పోటీ కొనసాగుతున్నది. భారత్‌తో రెండు, మూడు టెస్టులు ఆడకపోవడంతో వెనుకబడిన కమిన్స్ ప్రస్తుతం 849 ర్యాంకింగ్ పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇకపోతే ఐసీసీ వారానికి ఒకసారి ర్యాంకింగ్స్‌ను అప్డేట్ చేస్తుంది. అందులో భాగంగా ఈ వారం కొత్త జాబితాను వెల్లడించింది. ఈ జాబితాలో సౌతాఫ్రికా బౌలర్ కగీసో రబడా 807 ర్యాంకింగ్ పాయింట్స్‌తో నాలుగో స్థానంలో ఉన్నాడు. భారత్‌తో టెస్ట్ సిరీస్‌లో విజృంభిస్తున్న ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియోన్ ఐదు స్థానాలు మెరుగుపర్చుకుని టాప్-10లోకి ప్రవేశించాడు. ప్రస్తుతం లియోన్ 9వ స్థానంలో ఉన్నాడు. చదవండి: డబ్ల్యూపీఎల్‌లో చరిత్ర సృష్టించిన ఇంగ్లీష్ క్రికెటర్.. కోహ్లి సహా ఏ ఒక్కరిని వదిలిపెట్టని రోహిత్ శర్మ.. -
BGT 2023: నంబర్ 1 బౌలర్‌గా అశ్విన్.. ఒక స్థానం ఎగబాకిన బుమ్రా
ICC Test Bowling Rankings- Ravichandran Ashwin: టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 బౌలర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్‌ను వెనక్కినెట్టి మొదటి ర్యాంకు సొంతం చేసుకున్నాడు. స్వదేశంలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023లో సిరీస్‌లో తొలి రెండు టెస్టుల్లో అశూ అదరగొట్టిన విషయం తెలిసిందే. తొలి టెస్టులో 8 వికెట్లు తీసిన ఈ వెటరన్ స్పిన్నర్.. ఢిల్లీ టెస్టులోనూ అద్భుతంగా రాణించాడు. అశ్విన్ రెండో టెస్టులో మూడే! తొలి ఇన్నింగ్స్‌లో మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, అలెక్స్ క్యారీ వంటి కీలక బ్యాటర్ల వికెట్లు కూల్చి ఆసీస్‌ను దెబ్బ కొట్టిన అశ్విన్.. రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. మరో స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో కలిసి ఆసీస్ నడ్డి విరిచాడు. మరోవైపు న్యూజిలాండ్ పర్యటనలో తొలి టెస్టులో రాణించిన ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ రెండో టెస్టులో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. తొలి మ్యాచ్‌లో ఏడు వికెట్లు తీసి నంబర్ 1 ర్యాంకుకు చేరుకున్న ఆండర్సన్.. రెండో టెస్టులో మూడు వికెట్లు మాత్రమే తీయగలిగాడు. అశ్విన్- జేమ్స్ ఆండర్సన్ టాప్-5లో మనోళ్లు ఇద్దరు ఈ నేపథ్యంలో జేమ్స్ ఆండర్సన్ ఎనిమిది రేటింగ్ పాయింట్లు కోల్పయి రెండో స్థానానికి పడిపోగా.. 864 పాయింట్లతో ఉన్న అశ్విన్ నంబర్ 1గా అవతరించాడు. టాప్-5లో ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్, టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా, పాకిస్తాన్ ఫాస్ట్‌బౌలర్ షాహిన్ ఆఫ్రిది స్థానం సంపాదించారు. ఇంగ్లండ్ బౌలర్ ఓలీ రాబిన్సన్ రెండు ర్యాంకులే దిగజారడంతో బుమ్రా నాలుగోస్థానానికి చేరుకోగా.. ఆఫ్రిది టాప్-5లో చోటు దక్కించుకున్నాడు. కాగా 2015లో అశ్విన్ తొలిసారి టెస్టు ర్యాంకింగ్స్‌లో మొదటి ర్యాంకు సాధించాడు. ఇదిలా ఉంటే.. గత కొంతకాలంగా వెన్నునొప్పి కారణంగా జట్టుకు దూరమైనప్పటికీ బుమ్రా టాప్-5లో కొనసాగడం విశేషం. ఐసీసీ టెస్టు బౌలర్ల తాజా ర్యాంకింగ్స్ టాప్-5లో ఉన్నది వీళ్లే 1. రవిచంద్రన్ అశ్విన్- ఇండియా- 864 పాయింట్లు 2. జేమ్స్ ఆండర్సన్- ఇంగ్లండ్- 859 పాయింట్లు 3. ప్యాట్ కమిన్స్- ఆస్ట్రేలియా- 858 పాయింట్లు 4. జస్ప్రీత్ బుమ్రా- ఇండియా- 795 పాయింట్లు 5. షాహిన్ ఆఫ్రిది- పాకిస్తాన్- 787 పాయింట్లు చదవండి: BGT 2023 IND VS AUS 3rd Test: జడ్డూ బౌలింగ్‌లో లబూషేన్ క్లీన్ బౌల్డ్.. తొలిసారి తప్పించుకున్నాడు, రెండోసారి..! IND Vs AUS: ఏం జరుగుతోంది.. రోహిత్ శర్మ తప్పు చేశాడా? -
అండర్సన్... ఐదేళ్ల తర్వాత మళ్లీ ‘టాప్’లోకి...
దుబాయ్: ఐసీసీ టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ పేస్ బౌలర్ అండర్సన్ మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్నాడు. చివరిసారి 2018లో అండర్సన్ నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో అండర్సన్ ఏడు వికెట్లు పడగొట్టడంతో రెండు స్థానాలు ఎగబాకి 866 పాయింట్లతో అగ్రస్థానానికి చేరాడు. 1936 తర్వాత ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్ సాధించిన పెద్ద వయస్కుడిగా అండర్సన్ (40 ఏళ్ల 207 రోజులు) గుర్తింపు పొందాడు. భారత స్పిన్నర్ అశ్విన్ 864 పాయింట్లతో రెండో ర్యాంక్‌లో ఉన్నాడు. -
దిగజారిన విరాట్ కోహ్లీ ర్యాంకింగ్..
దుబాయ్: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజా టెస్ట్ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, చతేశ్వర్ పుజారాలు చెరో స్థానం కోల్పోయి ఐదు, ఏడు ర్యాంకులకు పడిపోయారు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో ఈ ఇద్దరు ఆటగాళ్లు చెరో అర్ధ శతకం సాధించినప్పటికీ తాజా ర్యాంకింగ్స్‌లో ఒక్కో స్థానం కోల్పోయారు. మరోవైపు ఇదే మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో అదరగొట్టిన ఇంగ్లాండ్ సారథి జో రూట్(218) రెండు స్థానాలను మెరుగుపరచుకొని మూడో ర్యాంక్‌కు చేరుకోగా, న్యూజిలాండ్ సారధి కేన్ విలియమ్సన్, ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ ఒకటి, రెండు స్థానాల్లో కొనసాగుత్నున్నారు. మరో ఆసీస్ ఆటగాడు లబుషేన్ ఒక స్థానాన్ని కోల్పోయి నాలుగో ర్యాంక్‌కు పడిపోయాడు. పాకిస్థాన్ స్టార్ బ్యాట్స్‌మన్ బాబర్ అజామ్, కివీస్ ఆటగాడు హెన్రీ నికోల్స్, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్, ఆసీస్ ఓపెనర్ వార్నర్‌లు తలో స్థానాన్ని మెరుగుపరచుకొని ఆరు, ఎనిమిది, తొమ్మిది, పది స్థానాల్లో నిలిచారు. టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ చెన్నై టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 91 పరుగులు చేయడంతో తొలిసారిగా 700 రేటింగ్ పాయింట్లు సాధించి 13వ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక బౌలింగ్ విభాగానికి వస్తే.. ఆసీస్ పేసర్ పాట్ కమిన్స్, ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ బ్రాడ్ తొలి రెండు స్థానాలను నిలబెట్టుకోగా, మరో ఇంగ్లండ్ పేసర్ జిమ్మీ ఆండర్సన్ మూడు స్థానాలు ఎగబాకి మూడో ర్యాంక్‌కు చేరుకున్నాడు. టీమిండియా బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్, బూమ్రాలు చెరో స్థానాన్ని మెరుగుపరచుకొని ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచారు. -
అశ్విన్@1
అంతర్జాతీయ క్రికెట్ సంఘం(ఐసీసీ) టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్ లో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మొదటి స్ధానాన్ని దక్కించుకున్నాడు. న్యూజిలాండ్ తో జరిగిన టెస్టు సిరిస్ లో భీకర బౌలింగ్ తో కివీస్ ను చిత్తు చేసిన అశ్విన్ తాజాగా విడుదలైన టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్ లో 900 పాయింట్లతో తొలిస్ధానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇప్పటికే ఐసీసీ టెస్టు ఆల్ రౌండర్లలో జాబితాలో అశ్విన్ టాప్ ర్యాంకులో కొనసాగుతున్న విషయం తెలిసిందే. టెస్టు బౌలర్లు, ఆల్ రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా ఏడు, మూడు స్ధానాల్లో నిలిచాడు. కాగా, టెస్టు బ్యాట్స్ మన్ టాప్ 10 జాబితాలో అజింక్యా రహానే ఒక్కడే ఆరవ స్ధానంలో నిలిచాడు. టాప్ 10 టెస్టు బౌలర్లు 1.ఆర్.అశ్విన్(భారత్) 2.డేల్ స్టెయిన్(దక్షిణ ఆఫ్రికా) 3.జేమ్స్ అండర్సన్(ఇంగ్లాండ్) 4.ఎస్.సీ.జే బ్రాడ్(ఇంగ్లాండ్) 5.రంగనా హెరాత్(శ్రీలంక) 6.యాసిర్ షా(పాకిస్తాన్) 7.రవీంద్ర జడేజా(భారత్) 8.మిచెల్ స్టార్క్(ఆస్ట్రేలియా) 9.ఎన్.వాగ్నెర్(న్యూజిలాండ్) 10.వీ.డీ.ఫిలాండర్(దక్షిణ ఆఫ్రికా) టాప్ 10 టెస్టు ఆల్ రౌండర్లు 1.ఆర్.అశ్విన్(భారత్) 2.షకీబ్ అల్ హసన్(బంగ్లాదేశ్) 3.రవీంద్ర జడేజా(భారత్) 4.ఎమ్.ఎమ్ అలీ(ఇంగ్లాండ్) 5.మిచెల్ స్టార్క్(ఆస్ట్రేలియా) 6.వీ.డీ ఫిలాండరర్(దక్షిణ ఆఫ్రికా) 7.బీ.ఏ స్టోక్స్(ఇంగ్లాండ్) 8. స్టువర్ట్ బ్రాడ్(ఇంగ్లాండ్) 9.రంగనా హెరాత్(శ్రీలంక) 10.సీఆర్ వోక్స్(ఇంగ్లాండ్) టాప్ 10 టెస్టు బ్యాట్స్ మన్లు 1.ఎస్.పీ.డీ స్మిత్(ఆస్ట్రేలియా) 2.జేఈ రూట్(ఇంగ్లాండ్) 3.హషీమ్ ఆమ్లా(దక్షిణ ఆఫ్రికా) 4.యూనస్ ఖాన్(పాకిస్తాన్) 5.కేన్ విలియమ్ సన్(న్యూజిలాండ్) 6.అజింక్య రహానే(భారత్) 7.ఏ.బి.డివిలియర్స్(దక్షిణ ఆఫ్రికా) 8.ఏ.సి వోగ్స్(ఆస్ట్రేలియా) 9.డీ.ఏ వార్నర్(ఆస్ట్రేలియా) 10.ఏ.ఎన్.కుక్(ఇంగ్లాండ్)