ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(jasprith Bumrah) హవా కొనసాగుతున్నాడు. ఐసీసీ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో బుమ్రా 904 పాయింట్లతో తన అగ్రస్ధానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 సిరీస్‌లో బుమ్రా అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు.
మొత్తం 5 టెస్టుల్లో 13.06 సగటుతో 32 వికెట్లు సాధించి ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా బుమ్రా నిలిచాడు. ఈ క్రమంలోనే తన టెస్టు రేటింగ్ పాయింట్స్‌ను బుమ్రా మెరుగుపరుచుకున్నాడు. ఇక బౌలర్ల ర్యాంకింగ్స్‌లో బుమ్రా తర్వాత స్ధానాల్లో వరుసగా ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్(841), సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ(837) కొనసాగుతున్నారు.
మరోవైపు ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్ రవీంద్ర జడేజా(Ravindra jadeja) తన అగ్రస్ధానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. జడేజా ఖాతాలో ప్రస్తుతం 400 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో జడేజా పర్వాలేదన్పించాడు. మిగితా ప్లేయర్లతో పోలిస్తే కాస్త మెరుగ్గానే కన్పించాడు.
ఈ సిరీస్‌లో మొత్తం ఐదు మ్యాచ్‌లు ఆడిన జడ్డూ.. 27 సగటుతో 135 పరుగులు చేశాడు. జడేజా తర్వాత స్ధానాల్లో ప్రోటీస్ ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్ (294), బంగ్లా ప్లేయర్ మెహిదీ హసన్ (294) నిలిచారు. ఇక బ్యాటర్ల ర్యాంకింగ్స్ విషయానికి వస్తే.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit sharma) ర్యాంక్ మరింత దిగజారింది.
రోహిత్ ఒక స్ధానం దిగజారి 43వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. బీజీటీ సిరీస్‌లో రోహిత్ తీవ్ర నిరాశపరిచాడు. కాగా బీజీటీ సిరీస్‌లో రోహిత్ శర్మ తీవ్ర నిరాశపరిచాడు. అటు కెప్టెన్సీ, ఇటు బ్యాటింగ్ పరంగా రోహిత్ శర్మ పూర్తిగా తేలిపోయాడు. ఐదు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. రోహిత్ తన ఫామ్‌ను తిరిగి పొందేందుకు పదేళ్ల తర్వాత రంజీల్లో ఆడనున్నాడు.
చదవండి: Ind vs Eng: అతడికి ఇదే చివరి అవకాశం.. ఊపిరి కూడా ఆడనివ్వడు!
Comments
Please login to add a commentAdd a comment