వారం మురిపమే.. అండర్సన్‌తో సంయుక్తంగా | Ashwin Drops Six Points Tied With Anderson No-1 Test Bowler ICC Rankings | Sakshi
Sakshi News home page

R Ashwin: వారం మురిపమే.. అండర్సన్‌తో సంయుక్తంగా

Published Wed, Mar 8 2023 10:01 PM | Last Updated on Wed, Mar 8 2023 10:26 PM

Ashwin Drops Six Points Tied With Anderson No-1 Test Bowler ICC Rankings - Sakshi

ఐసీసీ టెస్ట్‌ బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో భారత వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌, ఇంగ్లండ్‌ సీమ్‌ బౌలర్ జేమ్స్‌ అండర్సన్‌ సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. గత వారం రోజులుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న అశ్విన్‌.. ఇప్పుడు అండర్సన్‌తో కలిసి అగ్రస్థానాన్ని పంచుకున్నాడు. ఆస్ట్రేలియాతో మూడో టెస్టు మ్యాచ్‌లో నాలుగు వికెట్లు మాత్రమే తీసిన అశ్విన్‌ ఆరు ర్యాంకింగ్‌ పాయింట్లు కోల్పోయాడు.

దీంతో అశ్విన్‌, అండర్సన్‌ ఇద్దరూ 859 ర్యాంకింగ్‌ పాయింట్లతో సంయుక్తంగా టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతున్నారు. అయితే గత కొంతకాలంగా ఐసీసీ టెస్ట్‌ బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో అశ్విన్‌, అండర్సన్‌, ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ మధ్య పోటీ కొనసాగుతున్నది. భారత్‌తో రెండు, మూడు టెస్టులు ఆడకపోవడంతో వెనుకబడిన కమిన్స్‌ ప్రస్తుతం 849 ర్యాంకింగ్‌ పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.

ఇకపోతే ఐసీసీ వారానికి ఒకసారి ర్యాంకింగ్స్‌ను అప్‌డేట్‌ చేస్తుంది. అందులో భాగంగా ఈ వారం కొత్త జాబితాను వెల్లడించింది. ఈ జాబితాలో సౌతాఫ్రికా బౌలర్‌ కగీసో రబడా 807 ర్యాంకింగ్ పాయింట్స్‌తో నాలుగో స్థానంలో ఉన్నాడు. భారత్‌తో టెస్ట్‌ సిరీస్‌లో విజృంభిస్తున్న ఆస్ట్రేలియా స్పిన్నర్‌ నాథన్‌ లియోన్‌ ఐదు స్థానాలు మెరుగుపర్చుకుని టాప్‌-10లోకి ప్రవేశించాడు. ప్రస్తుతం లియోన్‌ 9వ స్థానంలో ఉన్నాడు.

చదవండి: డబ్ల్యూపీఎల్‌లో చరిత్ర సృష్టించిన ఇంగ్లీష్‌ క్రికెటర్‌.. 

కోహ్లి సహా ఏ ఒక్కరిని వదిలిపెట్టని రోహిత్‌ శర్మ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement