శ్రీలంకతో తొలి టెస్టు
లీడ్స్: అండర్సన్ (5/29) బంతితో నిప్పులు చెరగడంతో మూడు రోజుల్లోనే ముగిసిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 88 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో కుక్‌సేన 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఫాలోఆన్ ఆడుతూ 1/0 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు శనివారం ఆట కొనసాగించిన లంక రెండో ఇన్నింగ్స్‌లో 35.3 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలింది. కుషాల్ మెండిస్ (53) మినహా అందరూ విఫలమయ్యారు. ఫిన్‌కు 3 వికెట్లు దక్కాయి. బెయిర్‌స్టోకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్ విజయం
Published Sun, May 22 2016 12:46 AM | Last Updated on Mon, Sep 4 2017 12:37 AM
Advertisement
Advertisement