Kaushal Mendes
-
ఓటమి దిశగా శ్రీలంక
పోర్ట్ ఎలిజబెత్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక ఓటమి దిశగా వెళుతోంది. కష్టసాధ్యమైన 488 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లంక నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లకు 240 పరుగులు చేసింది. కుషాల్ మెండిస్ (58), మ్యాథ్యూస్ (58 బ్యాటింగ్) అర్ధసెంచరీలు చేశారు. రబడ, మహరాజ్ చెరో 2 వికెట్లు తీశారు. గెలుపు కోసం లంక మరో 248 పరుగులు చేయాల్సి ఉండగా ప్రస్తుతం మ్యాథ్యూస్‌తో పాటు ధనంజయ డిసిల్వా (9 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 351/5తో ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్‌ను 6 వికెట్లకు 406 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. డి కాక్ (69), డు ప్లెసిస్ (67 నాటౌట్) అర్ధసెంచరీలు పూర్తి చేశారు. -
ఇంగ్లండ్, శ్రీలంక మూడో వన్డే రద్దు
బ్రిస్టల్: వర్షం కారణంగా ఇంగ్లండ్, శ్రీలంక మధ్య ఇక్కడ జరిగిన మూడో వన్డే మ్యాచ్ రద్దయింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. చండీమల్ (62), మ్యాథ్యూస్ (56), కుషాల్ మెండిస్ (53) అర్ధ సెంచరీలు చేయగా... వోక్స్, ప్లంకెట్ చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం ఇంగ్లండ్ 4 ఓవర్లలో వికెట్ కోల్పోయి 16 పరుగులు చేసింది. ఈ సమయంలో వచ్చిన వర్షం మళ్లీ తగ్గకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. ఐదు వన్డేల సిరీస్‌లో ప్రస్తుతం ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలో ఉంది. -
ఇంగ్లండ్ ఇన్నింగ్స్ విజయం
శ్రీలంకతో తొలి టెస్టు లీడ్స్: అండర్సన్ (5/29) బంతితో నిప్పులు చెరగడంతో మూడు రోజుల్లోనే ముగిసిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 88 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో కుక్‌సేన 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఫాలోఆన్ ఆడుతూ 1/0 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు శనివారం ఆట కొనసాగించిన లంక రెండో ఇన్నింగ్స్‌లో 35.3 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలింది. కుషాల్ మెండిస్ (53) మినహా అందరూ విఫలమయ్యారు. ఫిన్‌కు 3 వికెట్లు దక్కాయి. బెయిర్‌స్టోకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.