పోర్ట్ ఎలిజబెత్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక ఓటమి దిశగా వెళుతోంది. కష్టసాధ్యమైన 488 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లంక నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లకు 240 పరుగులు చేసింది. కుషాల్ మెండిస్ (58), మ్యాథ్యూస్ (58 బ్యాటింగ్) అర్ధసెంచరీలు చేశారు.
రబడ, మహరాజ్ చెరో 2 వికెట్లు తీశారు. గెలుపు కోసం లంక మరో 248 పరుగులు చేయాల్సి ఉండగా ప్రస్తుతం మ్యాథ్యూస్‌తో పాటు ధనంజయ డిసిల్వా (9 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 351/5తో ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్‌ను 6 వికెట్లకు 406 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. డి కాక్ (69), డు ప్లెసిస్ (67 నాటౌట్) అర్ధసెంచరీలు పూర్తి చేశారు.
ఓటమి దిశగా శ్రీలంక
Published Thu, Dec 29 2016 11:58 PM | Last Updated on Mon, Sep 4 2017 11:54 PM
Advertisement
Advertisement