అండర్సన్ అదుర్స్ | Anderson beats his aggressive instincts | Sakshi
Sakshi News home page

అండర్సన్ అదుర్స్

Published Mon, Jan 12 2015 12:49 AM | Last Updated on Sat, Sep 2 2017 7:34 PM

అండర్సన్ అదుర్స్

అండర్సన్ అదుర్స్

తొలి వన్డేలో లంకపై కివీస్ గెలుపుజయవర్ధనే సెంచరీ వృథా

 క్రైస్ట్‌చర్చ్: బ్రెండన్ మెకల్లమ్ (22 బంతుల్లో 51; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు బ్యాటింగ్‌కు తోడు అండర్సన్ (96 బంతుల్లో 81; 11 ఫోర్లు, 1 సిక్స్) సమయోచితంగా ఆడటంతో శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ 3 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత లంక 50 ఓవర్లలో 9 వికెట్లకు 218 పరుగులు చేసింది. జయవర్ధనే (107 బంతుల్లో 104; 12 ఫోర్లు, 1 సిక్స్) కెరీర్‌లో 18వ సెంచరీ సాధించాడు.

మిగతా వారు విఫలమయ్యారు. లంక స్కోరు 200/5 ఉన్న దశలో మెక్లీంగన్ నాలుగు బంతుల వ్యవధిలో మెండిస్, జయవర్ధనే, తిసారా పెరీరా (0)లను అవుట్ చేశాడు. తర్వాత కివీస్ 43 ఓవర్లలో 7 వికెట్లకు 219 పరుగులు చేసి నెగ్గింది.  అండర్సన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే గురువారం హామిల్టన్‌లో జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement