రెండో టెస్టులో ఆడతా: అండర్సన్
భారత్‌తో జరిగే రెండో టెస్టులో తను బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయని ఇంగ్లండ్ పేసర్ అండర్సన్ చెప్పాడు. భుజం గాయం నుంచి కోలుకుంటున్న తను ప్రస్తుతం జట్టుతో పాటే ఉన్నాడు. ‘వాస్తవానికి నా గాయం తీవ్రత దృష్ట్యా భారత్‌తో టెస్టులకు అందుబాటులో ఉండకపోవచ్చని అనుకున్నాం.
కానీ గత మూడు వారాలుగా బాగా మెరుగయ్యాను. రెండో టెస్టు ప్రారంభమయ్యే సమయానికి పూర్తి ఫిట్‌నెస్‌తో ఉంటానని భావిస్తున్నాను’ అని అండర్సన్ చెప్పాడు.