
డెవ్‌సిక్, అండర్సన్ సెంచరీలు
సాక్షి, విశాఖపట్నం: ఆంటాన్ డెవ్‌సిక్ (185 బంతుల్లో 115; 15 ఫోర్లు), కోరీ అండర్సన్ (126 బంతుల్లో 100; 16 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలతో ఆదుకోవడంతో భారత్ ‘ఎ’తో సోమవారం ఇక్కడ ప్రారంభమైన రెండో అనధికారిక టెస్టులో న్యూజిలాండ్ ‘ఎ’ కోలుకుంది. వైఎస్‌ఆర్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సరికి న్యూజిలాండ్ ‘ఎ’ తమ తొలి ఇన్నింగ్స్‌లో 89 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. ఆరంభంలో భారత బౌలర్లు చెలరేగడంతో కివీస్ 43 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. బ్రూమ్ (0), కచోపా (3), రాంచి (0), లాథమ్ (21) వెంట వెంటనే పెవిలియన్ చేరారు. ఈ దశలో అండర్సన్, డెవ్‌సిక్ కలిసి జట్టు ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. వీరిద్దరు కలిసి ఐదో వికెట్‌కు 165 పరుగులు జోడించారు. ఆట ముగిసే సమయానికి బ్రేస్‌వెల్ (12), ఇష్ సోధి (14) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో ధావల్ కులకర్ణి, జలజ్ సక్సేనాలకు చెరో 2 వికెట్లు దక్కాయి.