
‘షటిల్ ఎక్స్‌ప్రెస్’ విజేత సిరిల్
ఆంధ్రప్రదేశ్ కుర్రాడు సిరిల్ వర్మ ‘షటిల్ ఎక్స్‌ప్రెస్’లో మెరిశాడు. ఇక్కడ జరిగిన తుదిపోరులో అతను టైటిల్ సాధించాడు. బాలుర సింగిల్స్‌లో శనివారం జరిగిన ఫైనల్లో ఏపీ ఆటగాడు 21-19, 21-8తో వరుస గేముల్లో బెంగళూరుకు చెందిన అక్షయ్ శ్రీనివాస్‌ను కంగుతినిపించాడు.
ముంబై: ఆంధ్రప్రదేశ్ కుర్రాడు సిరిల్ వర్మ ‘షటిల్ ఎక్స్‌ప్రెస్’లో మెరిశాడు. ఇక్కడ జరిగిన తుదిపోరులో అతను టైటిల్ సాధించాడు. బాలుర సింగిల్స్‌లో శనివారం జరిగిన ఫైనల్లో ఏపీ ఆటగాడు 21-19, 21-8తో వరుస గేముల్లో బెంగళూరుకు చెందిన అక్షయ్ శ్రీనివాస్‌ను కంగుతినిపించాడు.
బాలికల విభాగంలో ఢిల్లీ అమ్మాయిల మధ్యే టైటిల్ పోరు జరిగింది. ఇందులో కనిక కన్వాల్ 21-7, 21-18తో భవ్య రిషిపై గెలుపొందింది. విజేతలకు రూ. 10 లక్షల నగదు బహుమతి అందజేశారు. ఐబీఎల్‌కు అనుబంధంగా పాఠశాలల స్థాయిలో ఈ ఈవెంట్‌ను నిర్వహించారు.