Sreenivasan Slams Mohanlal For Rejecting Prem Nazir Movie, Details Inside - Sakshi
Sakshi News home page

Mohanlal: మోహన్‌లాల్‌ మోసగాడు.. ప్రేమ్‌ బతికుండగా కాలయాపన చేసి చనిపోయాక కపట మాటలు..

Published Mon, Apr 3 2023 7:10 PM | Last Updated on Mon, Apr 3 2023 7:57 PM

Sreenivasan: I Will Write on Mohanlals Hypocrisy Before I Die - Sakshi

మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు సీనియర్‌ నటుడు శ్రీనివాసన్‌. దివంగత నటుడు‌ ప్రేమ్‌ నజీర్‌ డైరెక్ట్‌ చేయాలనుకున్న డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ సినిమాను మోహన్‌లాల్‌ తిరస్కరించాడని, కానీ మీడియా ముందు మాత్రం మాట మార్చాడని ఆరోపణలు గుప్పించాడు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీనివాసన్‌ మాట్లాడుతూ.. 'ప్రేమ్‌ నజీర్‌కు మోహన్‌లాల్‌తో ఓ సినిమా తీయాలని ఎంతో కోరికగా ఉండేది. కడతనందన్‌ అంబాడీ సినిమా సెట్‌లో ప్రేమ్‌ నాకు ఈ విషయం చెప్పాడు. మరింకే, మోహన్‌లాల్‌కు సూటయ్యేలా మంచి కథ రాసుకోమని సూచించాను. దీంతో ఓ కథ సిద్ధం చేసుకుని మోహన్‌లాల్‌కు వినిపిస్తే అతడు ఏమాత్రం ఆసక్తి చూపించలేదు. తర్వాత నేను ఓసారి నడరాజన్‌ అనే మధ్యవర్తి ద్వారా కథ వినిపిస్తే ఏకంగా అతడిని తిట్టాడు కూడా! అదే కథ 'సందేశం'గా రిలీజైంది.

నిజానికి ఈ సినిమా కోసం ప్రేమ్‌.. మోహన్‌లాల్‌కు ముందుగానే అడ్వాన్స్‌ కూడా ఇచ్చాడు. అప్పుడు ఆయన ఎంగేజ్‌మెంట్‌ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత కొంతకాలానికే ప్రేమ్‌ కన్నుమూశాడు. అతడు చనిపోయినప్పుడు మాత్రం మోహన్‌లాల్‌.. ప్రేమ్‌ సినిమాలో నటించాలనుకున్నాను, కానీ ఇంతలోనే ఇలా జరిగిపోయింది అని కపట మాటలు మాట్లాడాడు. నేను చచ్చేలోపు కచ్చితంగా అతడి నిజస్వరూపాన్ని మొత్తం బయటపెడతా' అని పేర్కొన్నాడు.

శ్రీనివాసన్‌ వ్యాఖ్యలపై ప్రేమ్‌ నజీర్‌ తనయుడు షానవాజ్‌ స్పందిస్తూ.. 'నాన్నగారు మోహన్‌లాల్‌తో సినిమా చేయాలనుకున్న మాట వాస్తవమే! మోహన్‌లాల్‌ ఎప్పుడూ ప్రియదర్శన్‌ను వెంటేసుకుని స్క్రిప్ట్‌ డిస్కషన్స్‌కు వస్తుండేవారు. మరి ఆ కథ ఎందుకు పట్టాలెక్కలేదనేది ఎవరికీ తెలియదు. కానీ ఓ విషయం మాత్రం చెప్పగలను.. శ్రీనివాసన్‌ చెప్పాడంటే కచ్చితంగా అందులో నిజం ఉండే ఉంటుంది. ఆయన మాటలను నమ్మకుండా ఉండలేం' అని చెప్పుకొచ్చాడు.


నటుడు ప్రేమ్‌ నజీర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement