చెన్నై : నటుడు పవర్‌స్టార్ శ్రీనివాసన్‌పై వణ్ణార్‌పేట పోలీస్‌స్టేషన్‌లో మరో మోసం కేసు నమోదయ్యింది. స్థానిక అన్నానగర్‌కు చెందిన శ్రీనివాసన్‌పై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. జైలు జీవితం అనుభవించి బెయిల్‌పై వచ్చిన శ్రీనివాసన్ స్వతహాగా వైద్యుడు. అయితే నటనతో పవర్‌స్టార్‌గా ప్రాచుర్యం పొందాడు. అంతే స్థాయిలో మోసం కేసుల్లోనూ పాపులర్ అయ్యాడు. వడ్డీకి డబ్బు ఇప్పిస్తానని, సినిమాల్లో అవకాశాలు కల్పిస్తానని చెప్పి మోసానికి పాల్పడినట్లు శ్రీనివాసన్‌పై చెన్నై నేరపరిశోధన శాఖావిభాగంలో, కీల్‌పాక్కం, అన్నానగర్ పోలీస్‌స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా రూ.వెయ్యి కోట్ల రుణం ఇప్పిస్తానని ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త వద్ద కమీషన్‌గా రూ.100 కోట్లు తీసుకుని మోసం చేసిన కేసులో ఢిల్లీ పోలీసులు శ్రీనివాసన్‌ను ఈ మధ్యే అరెస్ట్ చేశారు. ఆ కేసులో బెయిల్ పొందిన శ్రీనివాసన్‌పై తాజాగా పుదు వణ్ణైయార్‌పేటకు చెందిన ముత్తు కుమారుడు దయానిధి(32) వణ్నైయార్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
శ్రీనివాసన్ తనకు సినిమా అవకాశాలను కల్పిస్తానని చెప్పి 2015 సెప్టెంబరులో రూ.4.15లక్షలు తీసుకున్నాడని, అప్పటి నుంచి ఒక్క సినిమా అవకాశం కూడా కల్పించలేదని అతడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బు తిరిగి ఇవ్వాలని అడగ్గా..‘నువ్వు నాకెప్పుడు ఇచ్చావంటూ’ బెదిరిస్తున్నాడని వాపోయాడు. తన డబ్బు తిరిగి ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరాడు. కేసు నమోదు చేసుకున్న వణ్ణైయార్‌పేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment