
'ఏడేళ్ల కంటే ఎక్కువ శిక్ష పడొచ్చు'
న్యూఢిల్లీ: ఎమ్మెల్యేకు ముడుపుల కేసులో అరెస్టయిన టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై నమోదు చేసిన 120 B, 34 సెక్షన్ల ప్రకారం త్వరగా బెయిల్ రాదని సీనియర్ న్యాయవాది శ్రీనివాసన్ అన్నారు. ప్రజా ప్రతినిధులు నిందితులుగా ఉన్న ఇలాంటి కేసులను కోర్టులు తీవ్రంగా పరిగణిస్తాయని చెప్పారు. దోషీగా తేలితే ఏడేళ్ల కంటే ఎక్కవు శిక్ష పడే అవకాశముందని శ్రీనివాసన్ అభిప్రాయపడ్డారు. సెక్షన్ 34 ప్రకారం కేసులో ప్రమేయమున్న వారందరిపైనా ఛార్జిషీట్ దాఖలు చేయవచ్చని చెప్పారు. కేసు పురోగతిని బట్టి మరి కొన్ని సెక్షన్లను కూడా చేర్చవచ్చని శ్రీనివాసన్ అన్నారు.