
పెరంబూరు: నటి భువనేశ్వరి కొడుకుపై కేలంబాక్కం పోలీస్‌స్టేషన్‌లో కొత్తగా మరో కేసు నమోదైంది. నటి భువనేశ్వరి కొడుకు మిథున్ శ్రీనివాసన్ లా చదువుతున్నాడు. ఇతను స్థానిక తిరుమంగళంకు చెందిన వైద్య విద్యార్థిని అనుగ్రహను పెళ్లి చేసుకోమని వేధించిన చేసిన కేసులో ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు తిరుమంగళం పోలీసులు కేసు నమోదు చేశారు.
దీంతో పరారీలో ఉన్న మిథున్ శ్రీనివాసన్‌ను రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేసి పుళల్ జైలులో ఉంచారు. అనుగ్రహపై హత్యా బెదిరింపులకు పాల్పడినందుకు గానూ మిథున్ శ్రీనివాసన్‌పై గురువారం కేలంబాక్కం పోలీస్‌స్టేషన్‌లో మహిళా చిత్రహింస చట్టం కింద మరో కేసును నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment