క్రికెట్ను బీసీసీఐ చంపేస్తోంది: సుప్రీం
అవినీతికి అవకాశం ఇవ్వడం ద్వారా భారతదేశంలో క్రికెట్ను బీసీసీఐ చంపేస్తోందని సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ తదితర అంశాలపై విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
అయితే, భారత క్రికెట్ ప్రతిష్ఠను ఎవరూ దెబ్బతీయలేరని ఐసీసీ ఛైర్మన్ శ్రీనివాసన్ చెన్నైలో వ్యాఖ్యానించారు. ఐసీసీ వరల్డ్ కప్ కోసం ఎంఆర్ఎఫ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఆయన చెన్నై వచ్చారు. ఎంఆర్ఎఫ్ సంస్థతో ఒప్పందాలను ఆయన మార్చుకున్నారు. కోర్టులో ఉన్న విషయాలపై తాను మాట్లాడబోనని, ఎంఆర్ఎఫ్ ఒప్పందం కోసం తాను ఐసీసీ ఛైర్మన్గా మాత్రమే వచ్చానని చెప్పారు.