ipl betting case
-
TS Crime News: ఆన్లైన్ ఆటలు ఆడుతున్నారా..! జర జాగ్రత్త..!
కుమరం భీం: నగరాలు, పట్టణాలకే పరిమితమైన ఆన్లైన్ బెట్టింగ్ ఆదివాసీ జిల్లా కుమురంభీంలోనూ క్రమంగా విస్తరిస్తోంది. కఠిన చట్టాలు, పోలీసుల నిఘా ఉన్నా బెట్టింగ్ దందాలకు అడ్డుకట్ట పడటం లేదు. సులువుగా డబ్బులు సంపాదించాలనే అత్యాశతో చాలా మంది యువత బానిసలుగా మారుతున్నారు. చివరికి అప్పుల్లో కూరుకుపోయి ఆర్థిక ఇబ్బందులతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, రెబ్బెన, కౌటాల, చింతలమానెపల్లి, పెంచికల్పేట్, వాంకిడి వంటి ప్రాంతాల్లోని యువత తరచూ నిషేధిత ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నట్లు తెలుస్తోంది. కాగజ్‌నగర్‌లోని ఓ చిట్‌ఫండ్‌లో కలెక్షన్ బాయ్‌గా విధులు నిర్వర్తించే ప్రమోద్‌సింగ్ అనే యువకుడు మూడేళ్లుగా ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నాడు. దాదాపుగా రూ.2.60 లక్షల వరకు ఆన్లైన్ గేమ్స్‌లో పోగొట్టుకున్నాడు. కస్టమర్ల నుంచి వసూలు చేసిన డబ్బును కూడా ఈ ఆదివారం రాత్రి ఆన్లైన్ బెట్టింగ్‌లో పెట్టి పోగొట్టుకున్నాడు. కంపెనీ మేనేజర్లను డబ్బు విషయంలో పక్కదారి పట్టించేందుకు ఈ నెల 21న కాగజ్‌నగర్ మండలం ఈజ్గాం సమీపంలో తనకు తానే మందు బాటిల్స్‌తో తీవ్రంగా గాయపర్చుకున్నాడు. తనపై ముగ్గురు దాడి చేసి, డబ్బులు ఎత్తుకెళ్లారని పోలీసులకు చెప్పాడు. విచారణలో బెట్టింగ్ విషయం బయట పడింది. కౌటాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన నలుగురు యువకులు ఏడాది నుంచి ఆన్లైన్లో కాక్‌ఫైట్ ఆన్లైన్ గేమ్ ఆడుతున్నారు. చైన్ సిస్టం లాంటి ఈ గేమ్‌లో ఒకరి నుంచి మరొకరు గేమ్ ఆడటం మొదలెట్టారు. ఈ క్రమంలో దాదాపు పదేళ్లపాటు కష్టపడి సంపాదించిన నగదు ఈ గేమ్‌లో పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది. నలుగురు యువకులు ఏకంగా రూ.1.60 కోటికి పైగానే కోల్పోయినట్లు సమాచారం. ఈ ఘటనలు జిల్లాలో ఆన్లైన్ బెట్టింగ్ సంస్కృతి ఎలా విస్తరిస్తుందో తెలియజేస్తున్నాయి. నిఘా ఉన్నా.. ప్రస్తుతం గ్రామాల్లోని ప్రజల చేతుల్లోకి స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే పోలీసులు ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్‌తోపాటు మూడు ముక్కలాట పేరుతో ముగ్గులోకి దింపి అందినకాడికి దండుకునే ముఠాలపై గట్టి నిఘా పెడుతున్నారు. వరుస బెట్టింగ్‌లకు పాల్పడుతున్న వారిని గుర్తించి కేసులు సైతం నమోదు చేస్తున్నారు. అయినా ఈ విష సంస్కృతికి అడ్డుకట్ట పడటం లేదు. యువకులు, చిరు వ్యాపారులు సైతం బెట్టింగ్ మోజులో పడి ఉన్నదంతా పోగొట్టుకుని అప్పుల పాలవుతున్నారు. గతంలో హైదరాబాద్ కేంద్రంగా సాగే ఈ దందాలు.. ఇప్పుడు జిల్లాలోని అన్ని పల్లెలకూ పాకడం కలవరపెడుతోంది. నేరుగా పరిచయం లేకుండానే సెల్ఫోన్లోనే బెట్టింగ్ యాప్‌లు ఇన్స్టాల్ చేసుకుని యూపీఐ ఐడీలతో నేరుగా నగదు బదిలీ చేస్తున్నారు. రాష్ట్రంలో నిషేధించిన యాప్‌లను వీపీఎన్ సాయంతో లొకేషన్ మారుస్తూ వినియోగిస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారం నడిపిస్తున్నారు. కొంత మంది మైనర్లు వారి తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాలు అనుసంధానం చేసి ఉన్న యూపీ ఐ ఐడీల ద్వారా పందెం కాస్తున్నారు. యువత ఈజీ మనీ కోసం కెరీర్‌ను సైతం ఇబ్బందుల్లోకి నెట్టి పక్కదారి పడుతున్నారు. తల్లిదండ్రులు దృష్టి సారిస్తేనే.. జిల్లాలో ఎక్కువగా క్రికెట్ బెట్టింగ్, ఆన్లైన్ మట్కా ఎక్కువగా సాగుతుంది. ఐపీఎల్ సమయంలో గ్రామీణ ప్రాంతాల్లోనే రూ.లక్షల్లో చే తులు మారుతుంది. ఈ నెలలో ప్రారంభమ య్యే ఆసియా క్రికెట్ కప్‌తోపాటు అక్టోబర్‌లో స్వదేశంలో మొదలయ్యే వన్డే ప్రపంచ కప్ మ్యాచ్‌ల సందర్భంగా బెట్టింగ్ జోరు మరింత పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులు, యువత ను తల్లిదండ్రులు నిత్యం గమనిస్తూ ఉండాలి. పెద్ద మొత్తంలో డబ్బులు అడిగిన సమయంలో ఆరా తీయాలి. వారికి కౌన్సెలింగ్ ఇప్పించి అవగాహన కార్యక్రమాలకు పంపించాలి. బెట్టింగ్ నిషేధం.. ఆన్లైన్ బెట్టింగ్ నిషేదం. ఎవరైనా బెట్టింగ్‌కు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఆన్లైన్ జూదంపై సమాచారం ఇస్తే వెంటనే చర్యలు చేపడుతాం. ఈ విషయమై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్నాం. – కరుణాకర్, డీఎస్పీ, కాగజ్‌నగర్ తల్లిదండ్రులు నిఘా ఉంచాలి.. యుక్త వయసు పిల్లలు ముఖ్యంగా 15 నుంచి 25 ఏళ్ల వారిపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలి. ఎక్కడికెళ్తున్నారు.. ఎం చేస్తున్నారు.. అనే విషయాలు తెలుసుకోవాలి. బెట్టింగ్‌ల వైపు మరలకుండా ఇతర వ్యాపకాలు ఉండేలా చూడాలి. ఇతరుల జీవితాలు ఎలా ఛిన్నాభిన్నం అవుతున్నాయో వారికి వివరించాలి. – రామకృష్ణ, డీఎంహెచ్‌వో అత్యాశతో నష్టం తక్కువ సమయంలోనే రూ.లక్షలు సంపాదించాలనే అనే దురాశ యువతను పక్కాదారి పట్టిస్తోంది. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్, కాక్‌ఫైట్, తీన్మార్ పేకాట, ఇతర జూదాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ఆటల్లో రూ.లక్షలు కోల్పోతున్నారు. డబ్బులు పోగొట్టుకున్న వారు తల్లిదండ్రులకు చెప్పలేక.. అప్పులు తీర్చలేక ఆర్థికంగా, మానసికంగా కృంగిపోతున్నాయి. మరో దారి లేకపోవడంతో కొంత మంది ఆత్మహత్య చేసుకునే స్థాయికి వెళ్తున్నారు. ఈ ఆన్లైన్ ఆటలకు బానిసవుతున్న వారిలో 18 నుంచి 28 ఏళ్ల వారే ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల జిల్లాలో చోటు చేసుకుంటున్న ఘటనలు తీవ్రతకు అద్దం పడుతున్నాయి. -
సైబరాబాద్ కమిషనరేట్ పరిధి లో బెట్టింగ్ ముఠా అరెస్ట్
-
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
మహబూబాబాద్ రూరల్: బెట్టింగ్‌లతో జీవితాలు ఆగమాగమవుతాయని, యువకులు బెట్టింగ్‌ల బారిన పడి బలికావద్దని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి అన్నారు. ‘కాయ్ రాజా కాయ్’ మానుకోటలో జోరుగా ఆన్లైన్ బెట్టింగ్ అనే శీర్షికన ఏప్రిల్ 18న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం విదితమే. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ విష సంస్కృతి గ్రామాలకు పాకి, రూ.100 నుంచి రూ.లక్షల వరకు నిమిషాల్లో నగదు చేతులు మారుతున్నాయి. దీంతో జిల్లా పోలీసులు, సెంట్రల్ క్రైం పోలీసులు అప్రమత్తమై ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను అరెస్టు చేశారు. మహబూబాబాద్ టౌన్ పోలీసుస్టేషన్ సమావేశ మందిరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్ వివరాలు వెల్లడించారు. క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడే వ్యక్తులపై జిల్లా పోలీసులు ప్రత్యేకమైన నిఘా పెట్టారు. మహబూబాబాద్ పట్టణంలో కొద్ది రోజుల నుంచి ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతూ అమాయకులను బలి చేస్తున్న ఏడుగురు మంది వ్యక్తులను మహబూబాబాద్ డీఎస్పీ ఆంగోతు నరేష్కుమార్, సీసీఎస్ సీఐ ఎన్.వెంకటేశ్వర్లు, టౌన్ సీఐ ఎస్.రవికుమార్ నిఘా పెట్టి పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా వారి వద్ద నుంచి రూ.2,09,920 నగదు, 8 సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో కె.గోపి, కె.సతీష్‌కుమార్, బి.భాస్కర్, ఎల్.వీరు, ఎం.వంశీకృష్ణ, బి.రాము, బి.శివరాజన్ ఉన్నారు. వీరంతా కూడా బెట్టింగ్‌లకు ఆన్లైన్ సేవలైన వాట్సాప్, గూగుల్‌ప్లే, పేటీఎం, ఫోన్ పేవంటి యాప్‌లను ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుని క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. వీరు క్రికెట్ టీం ఆరోజు ఆడే ఐపీఎల్ మ్యాచ్‌లోని టాప్‌గా ఉన్న టీంను అంచనా వేసుకుని మ్యాచ్ టు మ్యాచ్‌ను బట్టి, ప్లేయర్లను బట్టి బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మొబైల్ ఆన్లైన్ ద్వారా బెట్టింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. 8 మంది కోసం పోలీసులు పరిశోధించగా కె.సుధాకర్ అనే వ్యక్తి పరారయ్యాడు. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను పట్టుకునేందుకు ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో డీఎస్పీ ఆంగోతు నరేష్కుమార్, సీసీఎస్, టౌన్ సీఐలు ఎన్.వెంకటేశ్వర్లు, ఎస్.రవికుమార్, సీసీఎస్, టౌన్ ఎస్సైలు జి.రాజ్‌కుమార్, సీహెచ్.అరుణ్‌కుమార్, సీహెచ్.రమేష్‌బాబు, సీసీఎస్ ఏఎస్సై ఉప్పలయ్య, సీసీఎస్, సివిల్ పోలీసు పీసీలు బాలరాజు, వేణు, శంకర్, రఘురాం, సురేష్, సలీం తదితరులు పాల్గొన్నారు. -
ఐపీఎల్ బెట్టింగ్: మరికొందరు బాలీవుడ్ స్టార్స్
ముంబై : ఐపీఎల్ బెట్టింగ్ విచారణలో భాగంగా సల్మాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్‌ను విచారించిన పోలీసులుకు విస్తుపోయే విషయాలు వెల్లడైనట్లు తెలుస్తోంది. ఈ కేసులో అరెస్ట్ అయిన సోను జలాన్ వాంగ్మూలంతో థానే పోలీసులు అర్భాజ్ ఖాన్‌ను విచారించిన విషయం తెలిసిందే. ఈ విచారణ అనంతరం ఈ రాకెట్‌తో సంబంధమున్న మరింత మంది పేర్లు పోలీసులకు తెలిసినట్లు జాతీయ మీడియా వర్గాలు కథనాలు ఉటంకిచాయి. పోలీసులకు అర్భాజ్ ఏడుగురు బాలీవుడ్ ప్రముఖుల పేర్లు వెల్లడించాడని, ఆ పేర్లు విని పోలీసులు షాకయ్యారని తెలుస్తోంది. ఇక సోను జలాన్ ను విచారించగా, కోమల్, గాయత్రి అనే ఇద్దరు బార్ డ్యాన్సర్లతో తాను సిండికేట్ అయి దందాను నడిపించినట్టు చెప్పడంతో, వారిని నేడో రేపో అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్దమైనట్లు సమాచారం. సోను జలాన్‌కు ఫోన్లో రికార్డు చేసే అలవాటుందని, అందులో భాగంగానే సెలబ్రిటీలతో మాట్లాడేవేళ, ఆ మాటలను తన సెల్ ఫోన్ లో రికార్డు చేసేవాడని, ఆపై వారిని బెదిరించేవాడని కూడా పోలీసులు తేల్చారు. సోనూ క్లయింట్లుగా హై ప్రొఫైల్ వ్యక్తులున్నారని, అర్బాజ్ ను కూడా బెదిరించే సోనూ తన సిండికేట్ లో చేర్చుకున్నాడని చెప్పారు. సోనూ క్లయింట్లుగా 1,200 మంది ఉన్నారని, ఈ సోనూ లాంటి వ్యక్తులను దేశవ్యాప్తంగా 100 మందిని ‘జూనియర్ కోల్‌కతా’ అనే వ్యక్తి నియమించుకున్నాడని తెలుస్తోంది. ‘జూనియర్ కోల్ కతా’ అండర్ వరల్డ్ డాన్ దావుద్ అనుచరుడని, బెట్టింగ్ రాకెట్ బయటకు రాగానే అతను దేశాన్ని వదిలి పారిపోయాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకూ ఆరుగురిని అరెస్ట్ చేశామని ముంబై క్రైమ్ బ్రాంచ్ డీసీపీ అభిషేక్ త్రిముఖే మీడియాకు తెలిపారు. మరికొందరిని విచారిస్తున్నామని, సోనూ జలన్ విచారణలో అర్బాజ్ ఖాన్ పేరు చెప్పాడని, ఆయన్ను విచారించి స్టేట్ మెంట్ ను రికార్డు చేశామన్నారు. -
పోలీసులకు సహకరిస్తా: అర్బాజ్ ఖాన్
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ఐపీఎల్ బెట్టింగ్తో రూ.3 కోట్ల దాకా నష్టపోయినట్లు విచారణలో ఒప్పుకున్న విషయం తెలిసిందే. థానే పోలీసుల(ఏఈసీ) నుంచి సమన్లు అందుకున్న అర్బాజ్ నేటి ఉదయం వారి ఎదుట హాజరయ్యాడు. బెట్టింగ్ రాకెట్లో ప్రమేయం గురించి దాదాపు మూడు గంటలకు పైగానే అర్బాజ్‌ను ప్రశ్నించారు. ఈ విచారణ అనంతరం అర్బాజ్ ఖాన్ మీడియాతో మాట్లాడాడు. ఝ‘పోలీసులు నా వాంగ్మూలాన్ని తీసుకున్నారు. విచారణకు సంబంధించి పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చా. ఈ కేసులో వారికి సహకరిస్తా’ అని తెలిపాడు. విచారణలో... జలన్‌తో సంబంధాలను అంగీకరించిన అర్బాజ్, బెట్టింగ్‌లో డబ్బులు పెట్టినట్లు ఒప్పుకున్నాడని జాతీయ మీడియా వర్గాల కథనం మేరకు తెలుస్తోంది. గత ఐపీఎల్ సీజన్‌తో బెట్టింగ్ ద్వారా రూ.2.75 కోట్లు పొగొట్టుకున్నట్లు అర్బాజ్ చెప్పినట్లు సమాచారం. ఐదేళ్లుగా జలాన్ తెలుసని, గత కొంత కాలంగా తాను బెట్టింగ్‌లో డబ్బులు పెడుతున్నానని ఆయన అంగీకరించినట్లు ఈ కథనాలు ఉటంకించాయి. ‘అర్బాజ్ వచ్చారు. ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేశాం’ అని సీనియర్ అధికారి ప్రదీప్ శర్మ మీడియాకు వివరించారు. ‘విచారణలో సోనూ యోగేంద్ర జలన్‌తో ఉన్న సంబంధాలపై ఆరాతీశాం. ఫొటోలు చూపించి ప్రశ్నించాం. ఆ సమయంలో జలన్ కూడా అక్కడే ఉన్నాడు’ అని శర్మ వెల్లడించారు. బుకీలతో సంబంధాలపై తొలుత బుకాయించిన అర్బాజ్ ఖాన్.. జలన్ బెదిరిస్తూ చేసిన చాటింగ్ చూపించే సరికి అసలు విషయం వెల్లడించాడని తెలుస్తోంది. చదవండి: ఐపీఎల్ బెట్టింగ్: ఒప్పుకున్న సల్మాన్ సోదరుడు -
ఐపీఎల్ బెట్టింగ్: ఒప్పుకున్న అర్భాజ్ ఖాన్
సాక్షి, ముంబై: ఐపీఎల్ బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు, నిర్మాత అయిన అర్బాజ్ ఖాన్(50) పేరు వెలుగులోకి రావటం చర్చనీయాంశంగా మారింది. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు అయిన అర్బాజ్ ఐపీఎల్ బెట్టింగ్తో రూ.3 కోట్ల దాకా నష్టపోయినట్లు విచారణలో వెల్లడైంది. థానే పోలీసుల(ఏఈసీ) నుంచిసమన్లు అందుకున్న అర్బాజ్ నేటి ఉదయం వారి ఎదుట హాజరయ్యాడు. బెట్టింగ్ రాకెట్లో ప్రమేయం గురించి దాదాపు మూడు గంటలకు పైగానే అర్బాజ్‌ను ప్రశ్నించారు. విచారణలో... జలన్‌తో సంబంధాలను అంగీకరించిన అర్బాజ్, బెట్టింగ్‌లో డబ్బులు పెట్టినట్లు ఒప్పుకున్నాడని జాతీయ మీడియా వర్గాల కథనం. గత ఐపీఎల్ సీజన్‌తో బెట్టింగ్ ద్వారా రూ.2.75 కోట్లు పొగొట్టుకున్నట్లు అర్బాజ్ చెప్పినట్లు తెలుస్తోంది. ఐదేళ్లుగా జలాన్ తెలుసని, గత కొంత కాలంగా తాను బెట్టింగ్‌లో డబ్బులు పెడుతున్నానని ఆయన అంగీకరించినట్లు ఈ కథనాలు ఉటంకించాయి. ‘అర్బాజ్ వచ్చారు. ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేశాం’ అని సీనియర్ అధికారి ప్రదీప్ శర్మ మీడియాకు వివరించారు. ‘విచారణలో సోనూ యోగేంద్ర జలన్‌తో ఉన్న సంబంధాలపై ఆరాతీశాం. ఫోటోలు చూపించి ప్రశ్నించాం. ఆ సమయంలో జలన్ కూడా అక్కడే ఉన్నాడు’ అని శర్మ వెల్లడించారు. బుకీలతో సంబంధాలపై తొలుత బుకాయించిన అర్బాజ్ ఖాన్.. జలన్ బెదిరిస్తూ చేసిన ఛాటింగ్ చూపించే సరికి అసలు విషయం వెల్లడించాడంట. డైరీ ఆధారంగానే... ‘బెట్టింగ్‌లో ఓడిపోయిన డబ్బును అర్బాజ్ చెల్లించకపోవటంతో జలన్ బెదిరింపులకు పాల్పడ్డాడు. అవసరమైతే ఈ విషయంలో సల్మాన్‌ను నిలదీస్తామని వారు బెదిరించారు’ అని శర్మ మీడియాకు వెల్లడించారు. 2008లో భారత క్రికెట్‌ను, బాలీవుడ్‌ను కుదిపేసిన బెట్టింగ్ కేసును దర్యాప్తు చేపట్టిన ముంబై పోలీసులు, దర్యాప్తులో భాగంగా హైప్రొఫైల్ బుకీ జలన్తోపాటు మరో ముగ్గురిని ఈ ఏడాది మే 15న థానే పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా విస్మయానికి గురి చేసే విషయాలు వెలుగు చూశాయి. గతంలో జరిగిన సీజన్లలోనూ జరిగిన బెట్టింగ్ వ్యవహారాలతోపాటు ఈ సీజన్లో చేతులు మారిన కోట్ల రూపాయల వివరాలు బయటపడ్డాయి. ఇందులో భాగస్వాములైన ప్రముఖులతోపాటు వంద మంది బుకీల పేర్లను జలన్ తన డైరీలో రాసి పెట్టుకున్నాడు. అంతేందుకు ఈ ఐపీఎల్‌లోనూ వేలకోట్ల బెట్టింగ్ జరిగిందని, పారిశ్రామిక వేత్తలు, బాలీవుడ్ తారలు ఇందులో పాల్గొన్నారని సోనూ విచారణలో వెల్లడించాడు. దుబాయ్‌లోని ఓ హోటల్లో ఈ వ్యవహారం నడిచిందని, బాలీవుడ్ సెలబ్రిటీల స్వయంగా హాజరై బుకీలతో మంతనాలు నడిపినట్లు జలన్ తెలిపాడు. అయితే వారందరినీ విచారణ చేపడతారా? అన్న ప్రశ్నకు పోలీసులు సరైన సమాధానం ఇవ్వలేదు. ముంబై కమీషనర్ ఈ వ్యవహారంపై ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉంది. గతంలో ఐపీఎల్ బెట్టింగ్ స్కామ్‌లో అరెస్టయిన నటుడు విందూ దారాసింగ్, మరో ఇద్దరు ప్రముఖులు సోనూ ద్వారానే బెట్టింగ్‌కు పాల్పడటం గమనార్హం. స్పందించిన ఐపీఎల్ చైర్మన్... ‘ఈ వ్యవహారంపై ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడారు. ‘ప్రస్తుతం ఈ అంశం పోలీసుల పరిధిలో ఉంది. ఐసీసీ-బీసీసీఐలకు అవినీతి నిరోధక విభాగాలు ఉన్నాయి. అవసరమైతే పోలీసులు ఆయా విభాగాలను సంప్రదించొచ్చు’ అని శుక్లా సూచించారు. -
ఐపీఎల్ బెట్టింగ్ కేసులో ఈడీ దాడులు
న్యూఢిల్లీ: ఐపీఎల్ బెట్టింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు నిర్వహించారు. శుక్రవారం ఉదయం ఢిల్లీ, ముంబై, జైపూర్ సహా పలు నగరాల్లో అధికారులు సోదాలు చేశారు. ఐపీఎల్-8లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్‌ల మ్యాచ్‌లో బెట్టింగ్‌లో ప్రమేయమున్న అనూప్ మహాజన్ అనే బుకీని పఠాన్‌కోట్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి దగ్గర నుంచి 3.3 లక్షల నగదు, మొబైల్స్, ఎల్సీడీ స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్ కేసులో పోలీసులు మరో ఐదుగురిని కూడా అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. -
క్రికెట్‌ను బీసీసీఐ చంపేస్తోంది: సుప్రీం
అవినీతికి అవకాశం ఇవ్వడం ద్వారా భారతదేశంలో క్రికెట్‌ను బీసీసీఐ చంపేస్తోందని సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ తదితర అంశాలపై విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. అయితే, భారత క్రికెట్ ప్రతిష్ఠను ఎవరూ దెబ్బతీయలేరని ఐసీసీ ఛైర్మన్ శ్రీనివాసన్ చెన్నైలో వ్యాఖ్యానించారు. ఐసీసీ వరల్డ్ కప్ కోసం ఎంఆర్ఎఫ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఆయన చెన్నై వచ్చారు. ఎంఆర్ఎఫ్ సంస్థతో ఒప్పందాలను ఆయన మార్చుకున్నారు. కోర్టులో ఉన్న విషయాలపై తాను మాట్లాడబోనని, ఎంఆర్ఎఫ్ ఒప్పందం కోసం తాను ఐసీసీ ఛైర్మన్‌గా మాత్రమే వచ్చానని చెప్పారు.