అర్బాజ్‌ఖాన్ (ఫైల్ ఫొటో)
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ఐపీఎల్ బెట్టింగ్‌తో రూ.3 కోట్ల దాకా నష్టపోయినట్లు విచారణలో ఒప్పుకున్న విషయం తెలిసిందే. థానే పోలీసుల(ఏఈసీ) నుంచి సమన్లు అందుకున్న అర్బాజ్ నేటి ఉదయం వారి ఎదుట హాజరయ్యాడు. బెట్టింగ్ రాకెట్‌లో ప్రమేయం గురించి దాదాపు మూడు గంటలకు పైగానే అర్బాజ్‌ను ప్రశ్నించారు. ఈ విచారణ అనంతరం అర్బాజ్ ఖాన్ మీడియాతో మాట్లాడాడు. ఝ‘పోలీసులు నా వాంగ్మూలాన్ని తీసుకున్నారు. విచారణకు సంబంధించి పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చా. ఈ కేసులో వారికి సహకరిస్తా’ అని తెలిపాడు.
విచారణలో... జలన్‌తో సంబంధాలను అంగీకరించిన అర్బాజ్, బెట్టింగ్‌లో డబ్బులు పెట్టినట్లు ఒప్పుకున్నాడని జాతీయ మీడియా వర్గాల కథనం మేరకు తెలుస్తోంది. గత ఐపీఎల్ సీజన్‌తో బెట్టింగ్ ద్వారా రూ.2.75 కోట్లు పొగొట్టుకున్నట్లు అర్బాజ్ చెప్పినట్లు సమాచారం. ఐదేళ్లుగా జలాన్ తెలుసని, గత కొంత కాలంగా తాను బెట్టింగ్‌లో డబ్బులు పెడుతున్నానని ఆయన అంగీకరించినట్లు ఈ కథనాలు ఉటంకించాయి. ‘అర్బాజ్ వచ్చారు. ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశాం’ అని సీనియర్ అధికారి ప్రదీప్ శర్మ మీడియాకు వివరించారు. ‘విచారణలో సోనూ యోగేంద్ర జలన్‌తో ఉన్న సంబంధాలపై ఆరాతీశాం. ఫొటోలు చూపించి ప్రశ్నించాం. ఆ సమయంలో జలన్ కూడా అక్కడే ఉన్నాడు’ అని శర్మ వెల్లడించారు. బుకీలతో సంబంధాలపై తొలుత బుకాయించిన అర్బాజ్ ఖాన్.. జలన్ బెదిరిస్తూ చేసిన చాటింగ్ చూపించే సరికి అసలు విషయం వెల్లడించాడని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment