ipl betting scam
-
ఐపీఎల్ బెట్టింగ్: మరికొందరు బాలీవుడ్ స్టార్స్
ముంబై : ఐపీఎల్ బెట్టింగ్ విచారణలో భాగంగా సల్మాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్‌ను విచారించిన పోలీసులుకు విస్తుపోయే విషయాలు వెల్లడైనట్లు తెలుస్తోంది. ఈ కేసులో అరెస్ట్ అయిన సోను జలాన్ వాంగ్మూలంతో థానే పోలీసులు అర్భాజ్ ఖాన్‌ను విచారించిన విషయం తెలిసిందే. ఈ విచారణ అనంతరం ఈ రాకెట్‌తో సంబంధమున్న మరింత మంది పేర్లు పోలీసులకు తెలిసినట్లు జాతీయ మీడియా వర్గాలు కథనాలు ఉటంకిచాయి. పోలీసులకు అర్భాజ్ ఏడుగురు బాలీవుడ్ ప్రముఖుల పేర్లు వెల్లడించాడని, ఆ పేర్లు విని పోలీసులు షాకయ్యారని తెలుస్తోంది. ఇక సోను జలాన్ ను విచారించగా, కోమల్, గాయత్రి అనే ఇద్దరు బార్ డ్యాన్సర్లతో తాను సిండికేట్ అయి దందాను నడిపించినట్టు చెప్పడంతో, వారిని నేడో రేపో అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్దమైనట్లు సమాచారం. సోను జలాన్‌కు ఫోన్లో రికార్డు చేసే అలవాటుందని, అందులో భాగంగానే సెలబ్రిటీలతో మాట్లాడేవేళ, ఆ మాటలను తన సెల్ ఫోన్ లో రికార్డు చేసేవాడని, ఆపై వారిని బెదిరించేవాడని కూడా పోలీసులు తేల్చారు. సోనూ క్లయింట్లుగా హై ప్రొఫైల్ వ్యక్తులున్నారని, అర్బాజ్ ను కూడా బెదిరించే సోనూ తన సిండికేట్ లో చేర్చుకున్నాడని చెప్పారు. సోనూ క్లయింట్లుగా 1,200 మంది ఉన్నారని, ఈ సోనూ లాంటి వ్యక్తులను దేశవ్యాప్తంగా 100 మందిని ‘జూనియర్ కోల్‌కతా’ అనే వ్యక్తి నియమించుకున్నాడని తెలుస్తోంది. ‘జూనియర్ కోల్ కతా’ అండర్ వరల్డ్ డాన్ దావుద్ అనుచరుడని, బెట్టింగ్ రాకెట్ బయటకు రాగానే అతను దేశాన్ని వదిలి పారిపోయాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకూ ఆరుగురిని అరెస్ట్ చేశామని ముంబై క్రైమ్ బ్రాంచ్ డీసీపీ అభిషేక్ త్రిముఖే మీడియాకు తెలిపారు. మరికొందరిని విచారిస్తున్నామని, సోనూ జలన్ విచారణలో అర్బాజ్ ఖాన్ పేరు చెప్పాడని, ఆయన్ను విచారించి స్టేట్ మెంట్ ను రికార్డు చేశామన్నారు. -
పోలీసులకు సహకరిస్తా: అర్బాజ్ ఖాన్
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ఐపీఎల్ బెట్టింగ్తో రూ.3 కోట్ల దాకా నష్టపోయినట్లు విచారణలో ఒప్పుకున్న విషయం తెలిసిందే. థానే పోలీసుల(ఏఈసీ) నుంచి సమన్లు అందుకున్న అర్బాజ్ నేటి ఉదయం వారి ఎదుట హాజరయ్యాడు. బెట్టింగ్ రాకెట్లో ప్రమేయం గురించి దాదాపు మూడు గంటలకు పైగానే అర్బాజ్‌ను ప్రశ్నించారు. ఈ విచారణ అనంతరం అర్బాజ్ ఖాన్ మీడియాతో మాట్లాడాడు. ఝ‘పోలీసులు నా వాంగ్మూలాన్ని తీసుకున్నారు. విచారణకు సంబంధించి పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చా. ఈ కేసులో వారికి సహకరిస్తా’ అని తెలిపాడు. విచారణలో... జలన్‌తో సంబంధాలను అంగీకరించిన అర్బాజ్, బెట్టింగ్‌లో డబ్బులు పెట్టినట్లు ఒప్పుకున్నాడని జాతీయ మీడియా వర్గాల కథనం మేరకు తెలుస్తోంది. గత ఐపీఎల్ సీజన్‌తో బెట్టింగ్ ద్వారా రూ.2.75 కోట్లు పొగొట్టుకున్నట్లు అర్బాజ్ చెప్పినట్లు సమాచారం. ఐదేళ్లుగా జలాన్ తెలుసని, గత కొంత కాలంగా తాను బెట్టింగ్‌లో డబ్బులు పెడుతున్నానని ఆయన అంగీకరించినట్లు ఈ కథనాలు ఉటంకించాయి. ‘అర్బాజ్ వచ్చారు. ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేశాం’ అని సీనియర్ అధికారి ప్రదీప్ శర్మ మీడియాకు వివరించారు. ‘విచారణలో సోనూ యోగేంద్ర జలన్‌తో ఉన్న సంబంధాలపై ఆరాతీశాం. ఫొటోలు చూపించి ప్రశ్నించాం. ఆ సమయంలో జలన్ కూడా అక్కడే ఉన్నాడు’ అని శర్మ వెల్లడించారు. బుకీలతో సంబంధాలపై తొలుత బుకాయించిన అర్బాజ్ ఖాన్.. జలన్ బెదిరిస్తూ చేసిన చాటింగ్ చూపించే సరికి అసలు విషయం వెల్లడించాడని తెలుస్తోంది. చదవండి: ఐపీఎల్ బెట్టింగ్: ఒప్పుకున్న సల్మాన్ సోదరుడు -
ఐపీఎల్ బెట్టింగ్ గుట్టు విప్పిన సల్మాన్ సోదరుడు
-
ఐపీఎల్ బెట్టింగ్: ఒప్పుకున్న అర్భాజ్ ఖాన్
సాక్షి, ముంబై: ఐపీఎల్ బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు, నిర్మాత అయిన అర్బాజ్ ఖాన్(50) పేరు వెలుగులోకి రావటం చర్చనీయాంశంగా మారింది. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు అయిన అర్బాజ్ ఐపీఎల్ బెట్టింగ్తో రూ.3 కోట్ల దాకా నష్టపోయినట్లు విచారణలో వెల్లడైంది. థానే పోలీసుల(ఏఈసీ) నుంచిసమన్లు అందుకున్న అర్బాజ్ నేటి ఉదయం వారి ఎదుట హాజరయ్యాడు. బెట్టింగ్ రాకెట్లో ప్రమేయం గురించి దాదాపు మూడు గంటలకు పైగానే అర్బాజ్‌ను ప్రశ్నించారు. విచారణలో... జలన్‌తో సంబంధాలను అంగీకరించిన అర్బాజ్, బెట్టింగ్‌లో డబ్బులు పెట్టినట్లు ఒప్పుకున్నాడని జాతీయ మీడియా వర్గాల కథనం. గత ఐపీఎల్ సీజన్‌తో బెట్టింగ్ ద్వారా రూ.2.75 కోట్లు పొగొట్టుకున్నట్లు అర్బాజ్ చెప్పినట్లు తెలుస్తోంది. ఐదేళ్లుగా జలాన్ తెలుసని, గత కొంత కాలంగా తాను బెట్టింగ్‌లో డబ్బులు పెడుతున్నానని ఆయన అంగీకరించినట్లు ఈ కథనాలు ఉటంకించాయి. ‘అర్బాజ్ వచ్చారు. ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేశాం’ అని సీనియర్ అధికారి ప్రదీప్ శర్మ మీడియాకు వివరించారు. ‘విచారణలో సోనూ యోగేంద్ర జలన్‌తో ఉన్న సంబంధాలపై ఆరాతీశాం. ఫోటోలు చూపించి ప్రశ్నించాం. ఆ సమయంలో జలన్ కూడా అక్కడే ఉన్నాడు’ అని శర్మ వెల్లడించారు. బుకీలతో సంబంధాలపై తొలుత బుకాయించిన అర్బాజ్ ఖాన్.. జలన్ బెదిరిస్తూ చేసిన ఛాటింగ్ చూపించే సరికి అసలు విషయం వెల్లడించాడంట. డైరీ ఆధారంగానే... ‘బెట్టింగ్‌లో ఓడిపోయిన డబ్బును అర్బాజ్ చెల్లించకపోవటంతో జలన్ బెదిరింపులకు పాల్పడ్డాడు. అవసరమైతే ఈ విషయంలో సల్మాన్‌ను నిలదీస్తామని వారు బెదిరించారు’ అని శర్మ మీడియాకు వెల్లడించారు. 2008లో భారత క్రికెట్‌ను, బాలీవుడ్‌ను కుదిపేసిన బెట్టింగ్ కేసును దర్యాప్తు చేపట్టిన ముంబై పోలీసులు, దర్యాప్తులో భాగంగా హైప్రొఫైల్ బుకీ జలన్తోపాటు మరో ముగ్గురిని ఈ ఏడాది మే 15న థానే పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా విస్మయానికి గురి చేసే విషయాలు వెలుగు చూశాయి. గతంలో జరిగిన సీజన్లలోనూ జరిగిన బెట్టింగ్ వ్యవహారాలతోపాటు ఈ సీజన్లో చేతులు మారిన కోట్ల రూపాయల వివరాలు బయటపడ్డాయి. ఇందులో భాగస్వాములైన ప్రముఖులతోపాటు వంద మంది బుకీల పేర్లను జలన్ తన డైరీలో రాసి పెట్టుకున్నాడు. అంతేందుకు ఈ ఐపీఎల్‌లోనూ వేలకోట్ల బెట్టింగ్ జరిగిందని, పారిశ్రామిక వేత్తలు, బాలీవుడ్ తారలు ఇందులో పాల్గొన్నారని సోనూ విచారణలో వెల్లడించాడు. దుబాయ్‌లోని ఓ హోటల్లో ఈ వ్యవహారం నడిచిందని, బాలీవుడ్ సెలబ్రిటీల స్వయంగా హాజరై బుకీలతో మంతనాలు నడిపినట్లు జలన్ తెలిపాడు. అయితే వారందరినీ విచారణ చేపడతారా? అన్న ప్రశ్నకు పోలీసులు సరైన సమాధానం ఇవ్వలేదు. ముంబై కమీషనర్ ఈ వ్యవహారంపై ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉంది. గతంలో ఐపీఎల్ బెట్టింగ్ స్కామ్‌లో అరెస్టయిన నటుడు విందూ దారాసింగ్, మరో ఇద్దరు ప్రముఖులు సోనూ ద్వారానే బెట్టింగ్‌కు పాల్పడటం గమనార్హం. స్పందించిన ఐపీఎల్ చైర్మన్... ‘ఈ వ్యవహారంపై ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడారు. ‘ప్రస్తుతం ఈ అంశం పోలీసుల పరిధిలో ఉంది. ఐసీసీ-బీసీసీఐలకు అవినీతి నిరోధక విభాగాలు ఉన్నాయి. అవసరమైతే పోలీసులు ఆయా విభాగాలను సంప్రదించొచ్చు’ అని శుక్లా సూచించారు. -
ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా
తీహార్ జైల్లో ఉన్న సమయంలో ఆత్మహత్య చేసుకుందామనే ఆలోచన కూడా పేసర్ శ్రీశాంత్‌కు వచ్చిందట. అయితే, ఎలాగోలా ఆ ఆలోచనల నుంచి బయటపడి, ఇప్పుడు మచ్చ కూడా తుడిచేసుకున్న ఈ కేరళ కుర్రాడు.. తనపై నిషేధం ఎత్తేయాల్సిందిగా బీసీసీఐని కోరాలని అనుకుంటున్నాడు. బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ అపాయింట్మెంట్ కోరానని శ్రీశాంత్ చెప్పాడు. బీసీసీఐ పెద్దలు తన విషయంలో సానుకూలంగా ఆలోచించడం చాలా సంతోషకరమని, వాళ్ల నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందా అని ఎదురు చూస్తున్నానని తెలిపాడు. క్రికెట్ బెట్టింగ్ రాకెట్‌తో తనకు సంబంధాలున్నాయని, దావూద్ ఇబ్రహీం, ఛోటా షకీల్ లాంటివాళ్లతో లింకులు ఉన్నాయన్న ఆరోపణలతో తనను అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు తాను అనుభవించిన బాధ అంతా ఇంతా కాదని శ్రీశాంత్ తెలిపాడు. అయితే.. శివారాధనతోనే తాను ఆ భావనల నుంచి బయట పడినట్లు చెప్పాడు. తాను ఇప్పటికీ వేచి చూస్తానని, ఎవరిమీదా దావాలు వేయాలన్న ఆలోచన లేదని, ఇప్పటికీ క్రికెట్ ఆడాలన్నదే తన కోరిక అని చెప్పాడు. తనపై విధించిన జీవితకాల నిషేధం ఎత్తేసిన తర్వాత మాత్రమే తాను ప్రాక్టీసు మళ్లీ మొదలుపెడతానని శ్రీశాంత్ అన్నాడు. -
ఐపీఎల్‌కు దూరంగా ఉంటా: శ్రీనివాసన్
బీసీసీఐ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు అనుమతి ఇవ్వాలని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ సుప్రీంకోర్టును కోరారు. ఐపీఎల్ బెట్టింగ్ కుంభకోణం వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఒకవేళ తాను ఆ సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికైతే.. ఐపీఎల్ బెట్టింగ్ కుంభకోణం విషయంలో తనకు ఉన్నత స్థాయి సంఘం నుంచి క్లీన్ చిట్ వచ్చేవరకు ఐపీఎల్ వ్యవహారాలకు దూరంగా ఉంటానని కూడా సుప్రీంకోర్టుకు ఆయన తెలిపారు. -
మేయప్పన్‌ను పక్కన పెట్టాం: శ్రీనివాసన్
చెన్నై సూపర్ కింగ్స్ ప్రిన్సిపల్ గురునాథ్ మేయప్పన్ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఐపీఎల్ మ్యాచ్‌లలో ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారాలపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో బీసీసీఐని పక్కన పెట్టలేమని, ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని శ్రీనివాసన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రశ్నించారు. గురునాథ్ మేయప్పన్‌ను ఇప్పటికే పక్కన పెట్టామని శ్రీనివాసన్ సుప్రీంకోర్టుకు సమాధానం ఇచ్చారు. ఎలాంటి శిక్ష విధించాలో నిర్ణయించాల్సిందిగా ముద్గల్ కమిటీకే చెప్పాలని ఆయన కోరారు. -
శ్రీనివాసన్‌ను నమ్మేదెలా: సుప్రీంకోర్టు
-
శ్రీనివాసన్‌ను నమ్మేదెలా: సుప్రీంకోర్టు
ఐపీఎల్ బెట్టింగ్ కుంభకోణం విషయంలో సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించింది. శ్రీనివాసన్‌కు ద్వంద్వ ప్రయోజనాలు లేవంటే నమ్మేదెలాగని ఈ కేసును విచారిస్తున్న ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆయన బీసీసీఐ అధ్యక్షుడిగా, చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీకి యజమానిగా ఉన్నారని.. ఆయన అల్లుడు గురునాథ్ మేయప్పన్ ఫ్రాంచైజీకి ప్రిన్సిపల్‌గా ఉన్నారని తెలిపింది. ఇలాంటి శ్రీనివాసన్.. అభియోగాలకు అతీతంగా ఉండాల్సిందని, ఆట స్వచ్ఛతను కాపాడాల్సింది ఆయనేనని సుప్రీంకోర్టు తెలిపింది.