ఫ్లెచర్‌కు బీసీసీఐ మద్దతు
న్యూఢిల్లీ: ఇటీవలి భారత జట్టు వరుస పరాజయాలకు ప్రస్తుత కోచ్ డంకన్ ఫ్లెచర్‌ను బాధ్యుడిని చేసే ఆలోచన లేదని బీసీసీఐ తేల్చి చెప్పింది. ఆయన్ని ఆ పదవి నుంచి తప్పించబోమని స్పష్టం చేసింది. జట్టు పేలవ ప్రదర్శనపై చర్చించేందుకు బోర్డు అధ్యక్షుడు శ్రీనివాసన్‌తో గురువారం కోచ్ ఫ్లెచర్ సమావేశమయ్యారు.
‘నేనో విషయం స్పష్టం చేయదలుచుకున్నాను. ఫ్లెచర్‌కు బీసీసీఐ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఆయన తొలగింపుపై ఎలాంటి చర్చ జరుగలేదు. ‘మీ శిక్షణ సామర్థ్యంపై మాకు నమ్మకముంది. ఈ విషయంలో ఎలాంటి ఆందోళన వద్దు’ అని ఫ్లెచర్‌కు చెప్పాము. మా అధ్యక్షుడు ఆయన్ని హెచ్చరించాడనే విషయం అబద్ధం’ అని బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ తెలిపారు. ఫ్లెచర్‌ను వెంటనే తొలగించాలని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ చేస్తున్న డిమాండ్‌పై స్పందిస్తూ... అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని... ఈ విషయంలో బీసీసీఐ చేయాల్సింది ఏమీ లేదని స్పష్టం చేశారు.