వాషింగ్టన్: అమెరికా సుప్రీం కోర్టు జడ్జీ బరిలో శ్రీ శ్రీనివాసన్, మరో ఇద్దరి మధ్య పోటీ నెలకొంది. ప్రస్తుతం అధ్యక్షుడు ఒబామా ఈ జాబితాను పరిశీలిస్తున్నారు. అయితే శ్రీనివాసన్, మెర్రిక్ గార్లాండ్ రిపబ్లికన్ పార్టీ మద్దతుతో ముందంజలో ఉన్నారు. అరుదుగా ఖాళీ అయ్యే ఈ స్థానంలో సమర్థుడైన వారిని నియమించాలని ఒబామా యోచిస్తున్నట్లు సమాచారం. అయితే బరిలో కేటన్జీ బ్రౌన్ జాక్సన్(45) కూడా ఉన్నట్లు వైట్‌హౌజ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
సుప్రీం కోర్టు జడ్జీ జస్టిస్ స్కాలియా అనుమానాస్పదంగా మృతి చెందడంతో ఈ ఖాళీ ఏర్పడిన విషయం విదితమే. 2013లో శ్రీనివాసన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా సర్య్కూట్ అప్పీల్స్ కోర్టు జడ్జిగా నియమితులయ్యారు. యూఎస్‌లో ఇది అత్యంత ప్రాధాన్యమైన కోర్టుల్లో ఇది రెండవది. శ్రీ శ్రీనివాసన్‌కే ఒబామా మద్దత్తు ఉన్నట్లు తెలుస్తోంది.
ఒబామా మద్దుతు శ్రీనివాసన్‌కే
Published Sun, Mar 6 2016 1:55 AM | Last Updated on Thu, Apr 4 2019 5:12 PM
Advertisement
Advertisement