ఏవండీ.. ఆయనతో వెళ్లిపోతున్నా..!
హొసూరు: ఇద్దరు పిల్లల తల్లి అదృశ్యమైన సంఘటన క్రిష్ణగిరి పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. జిల్లా కేంద్రం క్రిష్ణగిరి పాతపేటకు చెందిన కార్పెంటర్ శ్రీనివాసన్(32). అతని భార్య అర్చన(25). వీరికి హర్షిత(3), తేజశ్రీ(2) పిల్లలున్నారు.
ఈ నెల 8వ తేదీ అర్చన విధులకెళ్లిన భర్త శ్రీనివాస్‌కు ఫోన్ చేసి తాను 9 నెలలుగా మరో వ్యక్తిని గాఢంగా ప్రేమిస్తున్నట్లు, తన రెండవ సంతానం తేజశ్రీని తీసుకొని అతనితో వెళ్లిపోతున్నట్లు, మొదటి సంతానం హర్షితను వదలివె ళ్లుతున్నట్లు తెలిపింది.
వెంటనే ఇంటికొచ్చిన శ్రీనివాస్‌కు భార్య కనిపించకపోవడంతో చుట్టు పక్కల, బంధువుల ఇళ్లలో గాలించినా దొరకకపోవడంతో శ్రీనివాస్ క్రిష్ణగిరి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని అదృశ్యమైన అర్చన కోసం గాలిస్తున్నారు.