krishna giri
-
భార్యను చంపి నాటకం.. ఘరానా ఎస్సై అరెస్ట్
క్రిష్ణగిరి: దంపతుల మధ్య ఏర్పడిన గొడవలో భార్యను గొంతు నులిమి హత్య చేసి ఆపై గుండెపోటుతో మృతి చెందినట్లు నాటకమాడిన ప్రత్యేక సబ్ ఇన్స్పెక్టర్ను క్రిష్ణగిరి తాలూకా పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా కేంద్రం క్రిష్ణగిరి సమీపంలోని దాసరపల్లి గ్రామానికి చెందిన రమేశ్ భార్య రాజలక్ష్మి (36). వీరికి గత 13 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. ఇద్దరు పిల్లలు. రాయకోట రోడ్డులోని పోలీస్ గృహవసతిలో నివాసముంటున్నారు. రమేష్ క్రిష్ణగిరి డ్యాం పోలీస్‌స్టేషన్‌లో స్పెషల్ ఎస్ఐగా పనిచేస్తున్నాడు. గత నెల 23న భార్యాభర్తల మద్య ఏర్పడిన గొడవల్లో రమేష్ భార్యను గొంతునులిమి హత్య చేశాడు. అనంతరం గుండెపోటుతో భార్య మృతి చెందిందని నాటకమాడాడు. విషయం తెలుసుకొన్న క్రిష్ణగిరి తాలూకా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శవాన్ని స్వాధీనపరుచుకొని శవపరీక్ష కోసం క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శవపరీక్షలో హత్య చేసినట్లు ధృవీకరించడంతో రమేష్‌ను అరెస్టు చేసి అతనిపై హత్య చేసు నమోదు చేశారు. (చదవండి: వయసు డెబ్బై ఆరు.. ఈ విషయంలో యమ హుషారు!) -
ఏవండీ.. ఆయనతో వెళ్లిపోతున్నా..!
హొసూరు: ఇద్దరు పిల్లల తల్లి అదృశ్యమైన సంఘటన క్రిష్ణగిరి పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. జిల్లా కేంద్రం క్రిష్ణగిరి పాతపేటకు చెందిన కార్పెంటర్ శ్రీనివాసన్(32). అతని భార్య అర్చన(25). వీరికి హర్షిత(3), తేజశ్రీ(2) పిల్లలున్నారు. ఈ నెల 8వ తేదీ అర్చన విధులకెళ్లిన భర్త శ్రీనివాస్‌కు ఫోన్ చేసి తాను 9 నెలలుగా మరో వ్యక్తిని గాఢంగా ప్రేమిస్తున్నట్లు, తన రెండవ సంతానం తేజశ్రీని తీసుకొని అతనితో వెళ్లిపోతున్నట్లు, మొదటి సంతానం హర్షితను వదలివె ళ్లుతున్నట్లు తెలిపింది. వెంటనే ఇంటికొచ్చిన శ్రీనివాస్‌కు భార్య కనిపించకపోవడంతో చుట్టు పక్కల, బంధువుల ఇళ్లలో గాలించినా దొరకకపోవడంతో శ్రీనివాస్ క్రిష్ణగిరి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని అదృశ్యమైన అర్చన కోసం గాలిస్తున్నారు. -
కృష్ణగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం
హైదరాబాద్: తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లా పరిధిలోని హొసూరు వద్ద గ్రానైట్ లారీని కొరియర్ వాహనం ఢీకొన్నది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. మృతి చెందిన వారిని క్రిష్టప్ప, చలపతి, రాజన్నలుగా గుర్తించారు. మృతులందరూ చిత్తూరు జిల్లా పలమనేరు వాసులుగా గుర్తించారు.