
క్రిష్ణగిరి: దంపతుల మధ్య ఏర్పడిన గొడవలో భార్యను గొంతు నులిమి హత్య చేసి ఆపై గుండెపోటుతో మృతి చెందినట్లు నాటకమాడిన ప్రత్యేక సబ్ ఇన్‌స్పెక్టర్‌ను క్రిష్ణగిరి తాలూకా పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా కేంద్రం క్రిష్ణగిరి సమీపంలోని దాసరపల్లి గ్రామానికి చెందిన రమేశ్ భార్య రాజలక్ష్మి (36). వీరికి గత 13 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. ఇద్దరు పిల్లలు. రాయకోట రోడ్డులోని పోలీస్ గృహవసతిలో నివాసముంటున్నారు.
రమేష్ క్రిష్ణగిరి డ్యాం పోలీస్‌స్టేషన్‌లో స్పెషల్ ఎస్‌ఐగా పనిచేస్తున్నాడు. గత నెల 23న భార్యాభర్తల మద్య ఏర్పడిన గొడవల్లో రమేష్ భార్యను గొంతునులిమి హత్య చేశాడు. అనంతరం గుండెపోటుతో భార్య మృతి చెందిందని నాటకమాడాడు. విషయం తెలుసుకొన్న క్రిష్ణగిరి తాలూకా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శవాన్ని స్వాధీనపరుచుకొని శవపరీక్ష కోసం క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శవపరీక్షలో హత్య చేసినట్లు ధృవీకరించడంతో రమేష్ను అరెస్టు చేసి అతనిపై హత్య చేసు నమోదు చేశారు.
(చదవండి: వయసు డెబ్బై ఆరు.. ఈ విషయంలో యమ హుషారు!)