'రాజీనామా చేయాలా.. ఫిట్గానే ఉన్నా కదా' | Arunachal Governor refuses to resign, says Prez has to dismiss him | Sakshi
Sakshi News home page

'రాజీనామా చేయాలా.. ఫిట్గానే ఉన్నా కదా'

Published Tue, Sep 6 2016 3:46 PM | Last Updated on Mon, Aug 20 2018 5:23 PM

'రాజీనామా చేయాలా.. ఫిట్గానే ఉన్నా కదా' - Sakshi

'రాజీనామా చేయాలా.. ఫిట్గానే ఉన్నా కదా'

గువాహటి: తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ జ్యోతి ప్రసాద్ రజ్కోవా అన్నారు. ఒక వేళ రాష్ట్రపతికి తనపై అసంతృప్తి కలిగి రాజీనామా చేయాలని చెప్పాక ఆ విషయం గురించి ఆలోచిస్తానని అన్నారు. ఆరోగ్యం బాగాలేని కారణంగా గవర్నర్ పదవి నుంచి దిగిపోవాలని జ్యోతి ప్రసాద్ను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కానీ ఇందుకు మాత్రం ఆయన ససేమిరా అంటూ ఝలక్ ఇచ్చారు.

'నేను రాజీనామా చేయను. ముందు రాష్ట్రపతిని నా విషయంలో అసంతృప్తి ప్రకటించనివ్వండి. అలాగే, ప్రభుత్వం కూడా రాజ్యాంగంలోని 156వ నిబంధనను ఉపయోగించనివ్వండి. నా ఆరోగ్యం బానే ఉంది. నేను పూర్తిగా కోలుకున్నాను. నా విధులు కూడా సక్రమంగా నిర్వహిస్తున్నాను. ఒక వేళ కేంద్రం నన్ను తొలగించాలని వారు అనుకుంటే ప్రధాని, ఆయన కేబినెట్ రాష్ట్రపతికి ప్రతిపాదన పంపించాలి. ఆయన మాత్రమే రాజ్యాంగం ప్రకారం నా విషయంలో తొలగింపు ఆదేశాలు జారీ చేస్తారు. ప్రభుత్వంలో పనిచేసే నాలుగో తరగతి ఉద్యోగి విషయంలోనైనా ఒక లేఖ రూపంలో రాసి సెలవుపైగానీ, కొనసాగింపుపైగానీ రాజీనామా చేయాలని కానీ డిమాండ్ చేస్తారు. అలాంటిది నేను ఒక గవర్నర్ను.. నాది రాజ్యంగ బద్ధమైన ఉద్యోగం' అని జ్యోతి ప్రసాద్ చెప్పారు.


'ఓ రోజు ఆగస్టు 27న గువాహటికి చెందిన ఓ వ్యక్తి ఫోన్ చేసి రాజీనామా చేయాలని చెప్పారు. నేను షాకయ్యాను. ఆశ్యర్యపోయాను. వెంటనే నేను హోంమంత్రి రాజ్ నాథ్కు ఫోన్ చేసి అడిగితే ఆ విషయం నాకు తెలియదన్నారు. పైగా నేను బాగా పనిచేస్తున్నానని కితాబిచ్చారు. కానీ, మరో కేంద్రమంత్రికి ఫోన్ చేయగా నన్ను ఆగస్టు 30న దిగిపోవాలని, ఆరోగ్యం కారణాలు దృష్టిలో పెట్టుకొని నన్ను రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పైగా ఇది ఉన్నత స్థాయిలో తీసుకున్న నిర్ణయమన్నారు. అందుకు అసలు నేనెందుకు రాజీనామా చేయాలని ప్రశ్నించాను. బానే ఉన్నానుగా అని సమాధానం ఇచ్చాను. నా జీవితంలో ఇప్పటి వరకు ఒక్క తప్పు చేయలేదు. ఒక వేళ నన్ను తొలగించాలనుకుంటే రాష్ట్రపతి ద్వారా తొలగించుకోవచ్చు. అప్పటి వరకు నేను రాజీనామా చేయను' అని జ్యోతి ప్రసాద్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement