ఆడపిల్ల పుట్టిందని కాపురానికి రావద్దన్న భర్త | Husband refuses wife for gave birth to daughter | Sakshi
Sakshi News home page

ఆడపిల్ల పుట్టిందని కాపురానికి రావద్దన్న భర్త

Published Sat, Jul 25 2015 8:34 PM | Last Updated on Fri, Jul 27 2018 2:18 PM

ఆడపిల్ల పుట్టిందని కాపురానికి రావద్దన్న భర్త - Sakshi

ఆడపిల్ల పుట్టిందని కాపురానికి రావద్దన్న భర్త

హైదరాబాద్ (జగద్గిరిగుట్ట) : ఆడపిల్ల పుట్టిందని భర్త కాపురానికి రావద్దంటున్నాడంటూ ఓ వివాహిత జగద్గిరిగుట్ట పోలీసులకు శనివారం ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే.. జగద్గిరిగుట్ట వెంకటేశ్వరనగర్‌కు చెందిన మరియాకు 2011లో రవి అనే వ్యక్తితో వివాహం జరిగింది. ఉద్యోగ రీత్యా వీరు కొన్నాళ్ల పాట్లు దక్షిణాఫ్రికాలో ఉండి ఇటీవలే ఇండియాకు వచ్చారు.

కాగా మరియా డెలివరీ కోసం తన పుట్టింటికి వెళ్లింది. మూడు నెలల క్రితం మరియా ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆడపిల్ల ఇష్టం లేని భర్త రవి అప్పటినుంచి ఆమెను దూరంగా ఉంచాడు. దీంతో తనను కాపురానికి రావద్దని చెప్పి పట్టించుకోవడం లేదంటూ మరియ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement