భర్త మృతితో భార్య, కూతురు ఆత్మహత్య | wife, daughter commits suicide after husband dies illness in srikalahasti | Sakshi
Sakshi News home page

భర్త మృతితో భార్య, కూతురు ఆత్మహత్య

Published Sat, Oct 25 2014 9:29 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

భర్త మృతితో భార్య, కూతురు ఆత్మహత్య - Sakshi

భర్త మృతితో భార్య, కూతురు ఆత్మహత్య

శ్రీకాళహస్తి : చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి రాజీవ్ నగర్లో విషాదం చోటుచేసుకుంది. భర్త మృతిని జీర్ణించుకోలేని భార్య, కుమార్తెతో కలిసి ఆత్మహత్య చేసుకుంది.  స్థానికంగా నివాసం ఉంటున్న శ్రీనివాస్ ఈ నెల 5వ తేదీన అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి భార్య లక్ష్మి తీవ్ర మనోవేదనకు గురవుతోంది. భర్త లేకుండా తాము జీవించలేమంటూ ఆమె పలుమార్లు బంధువుల వద్ద ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ నేపథ్యంలో శనివారం ఉదయం లక్ష్మి, తొమ్మిదో తరగతి చదువుతున్న కుమార్తె ప్రసన్నతో కలిసి ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. కాగా ఆ సమయంలో కుమారుడు ఇంట్లో లేనట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement