ornaments stolen
-
నమ్మించి మోసం చేశారు !
సాక్షి, వనపర్తి : షాపు యజమాని దగ్గర పనికి కుదిరాడు.. అతనితో నమ్మకంగా ఉండటంతో యజమాని షాపు తాళాలు అప్పగించాడు. అదే అదునుగా భావించిన నిందితుడు షాపులో ఉన్న వెండి కాళ్ల గొలుసులను తీసుకుని పారిపోయాడు. ఈ నేపథ్యంలో సోమవారం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ కిరణ్‌కుమార్ మాట్లాడుతూ... జిల్లా కేంద్రంలోని శంకర్‌గంజ్‌లో బంగారు షాపు యజమాని మహబూబ్ దగ్గర మహమ్మద్ షరీప్ పనికి కుదిరాడు. షాపు యజమానికి మహ్మాద్ షరీఫ్‌పై నమ్మకం కుదరడంతో అతనికి షాపుతాళాలు ఇచ్చి తెరిపించేవాడు. ఇదే అదునుగా భావించిన నిందితుడు ఈనెల 17న షాపు తెరిచి అందులో ఉన్న 4 కిలోల వెండి కాళ్ల గోలుసులు తీసుకుని, చింతలహనుమాన్ దేవాలయం వెనుకాల గుంతతీసి దాచిపెట్టాడు. ఎవ్వరికి అనుమానం రాకుండా వాటిపై రాళ్లు పెట్టి కడపకు వెళ్లాడు. షాపు యజమాని వచ్చి చూడగా.. షాపును కొద్దిగా మూసి అతను కనిపించకుండా పోయాడు. ఫోన్ చేసినా స్వీచ్ ఆఫ్ అయ్యింది. అనుమానం వచ్చిన యజమాని మహబూబ్ ఆభరణాలు పరిశీలించగా..దొంగతనం అయ్యాయని భావించాడు. దీంతో ఈ నెల 27న పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సోమవారం కడప నుంచి వనపర్తికి వచ్చిన మహమ్మద్ షరీప్ తాను దొంగతనం చేసిన 4 కిలోల పట్టీలలో 10 జతల కాళ్ల పట్టీలు తీసుకుని కొత్తకోట, ఆత్మకూర్‌లో అమ్మాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో వనపర్తి ఆర్టీసి బస్టాండ్‌కు రాగా ఎస్ఐ వెంకటేష్‌గౌడ్, సిబ్బంది తనిఖీ చేసి విచారించారు. నిందితుడు నేరం ఒప్పుకోవడంతో గుడి వెనకాల దాచిపెట్టిన మిగతా కాళ్లపట్టీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.కాగా, నిందితున్ని కోర్టులో ప్రవేశపెట్టినట్లు డీఎస్పీ తెలిపారు. -
‘బాబు పాలనలో భగవంతుని పట్ల తీరని అపచారం’
-
‘బాబు పాలనలో భగవంతుని పట్ల తీరని అపచారం’
తిరుపతి: టీటీడీ దేవస్థానంలో నగలు మాయమవుతున్నాయని అనేక ఫిర్యాదులు వచ్చినా ఏపీ సర్కారు విచారణ జరిపించకపోవడంపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతిలోని గోవిందరాజు స్వామి ఆలయంలో ఉత్సవమూర్తులకు అలంకరించే మూడు బంగారు కిరీటాలు మాయం కావడం సంస్కృతి, సాంప్రదాయాలకు తీవ్ర విఘాతం కలగడమేనన్నారు. గతంలో విజయవాడ కనకదుర్గమ్మ కిరీటాన్ని కూడా మాయం చేశారని ఈ సందర్భంగా భూమన పేర్కొన్నారు. ఆదివారం ప్రెస్‌కాన్పరెన్స్‌లో భూమన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు హయాంలో ఆలయాల ప్రతిష్ట దిగజారుతుందని విమర్శించారు. ‘చంద్రబాబు పాలనలో భగవంతుని పట్ల తీరని అపచారం జరుగుతోంది. భక్తులు సమర్పించిన నగలన్నీ ఎత్తుకెళ్లారని ప్రధాన అర్చకుడే ఆరోపణలు చేశారు. పింక్ డైమండ్‌ను చోరీ చేశారని.. ఇతర దేశాల్లో విక్రయించారని ఆరోపణలు వచ్చాయి. ఇక్కడ ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకున్నారే కానీ న్యాయ విచారణకు ఎందుకు ఆదేశించలేదు. చంద్రబాబుపై ఆరోపణలు చేస్తే వారిని సంఘ ద్రోహులుగా చిత్రీకరించారు. విజయవాడ పరిసరాల్లోనే దేవాలయాలు నేలమట్టం అయ్యాయి. చంద్రబాబు హయాంలో 40 దేవాలయాలు నేలమట్టం చేశారు. కాళహస్తి ఆలయం, బెజవాడ దుర్గమ్మ ఆలయాల్లో క్షుద్ర పూజలు జరుగుతున్నా చర్యలు ఎందుకు లేవు. అమరావతిలోని అమరేశ్వర ఆలయ భూములను తన తాబేదార్లకు తక్కువ ధరకే చంద్రబాబు కట్టబెట్టారు. చంద్రబాబు తీరు ఇలానే ఉంటే హైందవ ధర్మాన్ని ఎవరు రక్షిస్తారు. తిరుపతిలో గోవిందరాజు స్వామి ఆలయంలో దోపిడీ జరిగింది. అంటే ఎంత దోపిడీ వ్యవస్థ నడుస్తుందో అర్థం చేసుకోవాలి’ అని భూమన ఘాటుగా ప్రశ్నించారు. -
కిరీటాల మాయంపై కీలక ఆధారాలు లభ్యం!
-
తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో కిరీటాల మాయం
-
కిరీటాల మాయంపై కీలక ఆధారాలు లభ్యం!
సాక్షి, తిరుపతి: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో కిరీటాల మాయం ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశాయి. ఈ కేసులో ఇప్పటికే కొన్ని ఆధారాలను సేకరించినట్టు తెలుస్తోంది. కిరీటాల మాయం వెనుక ఇంటి దొంగల పనే ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆలయ సిబ్బందే కిరీటాలు మాయం చేసి ఉంటారన్న కోణంలో విచారణ జరుపుతున్నట్టు సమాచారం. ఆలయంలోని సీసీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులకు పలు కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. సాయంత్రం 5.40 గంటల నుంచి 6 గంటల మధ్యప్రాంతంలో కిరీటాలు చోరీ అయినట్టు పోలీసులు గుర్తించారు. చోరీ జరిగిన సమయంలో ఆలయంలో అర్చకులు బాలాజీ దీక్షితులు, శ్రీనివాసులు ఉన్నట్లు తెలుస్తోంది. చోరీ జరిగిన ప్రదేశంలో సీసీటీవీ కెమెరా ఒకటి పని చేయడం లేదని గుర్తించారు. కిరీటాల మాయం కచ్చితంగా ఇంటి దొంగల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా ఆలయ ప్రాంగణంలో మరోసారి డాగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించింది. 2011లోనూ.. టీటీడీ ఆలయాల్లో గతంలో కూడా పలుమార్లు నగలు మాయమయ్యాయి. 2011లో తిరుపతిలోని కోదండ రామస్వామి ఆలయంలోనూ నగల అపహారణ జరిగింది. ఈ కేసులో ఇప్పటికీ కూడా విచారణ కొనసాగుతూనే ఉంది. అప్పట్లో ఆలయ ప్రధాన అర్చకుడే నగలను తాకట్టు పెట్టినట్టు అధికారులు నిర్ధారించారు. అంతేకాదు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో సైతం గతంలో నగలు మాయమయ్యాయి. టీటీడీ ఆలయాల్లో వరుసగా జరగుతున్న నగల మాయంపై భక్తుల్లో ఆందోళన నెలకొంది. సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే నగలు మాయమవుతున్నాయంటూ భక్తులు ఆరోపిస్తున్నారు. ఆలయానికి చేరుకున్న పెద్ద జీయర్, చిన జీయర్.. కిరీటాల చోరీ నేపథ్యంలో తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయానికి పెద్ద జీయర్, చిన జీయర్ చేరుకున్నారు. మరోవైపు తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో కిరీటాల మాయం కావడంలో బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. టీటీడీ అనుబంధ ఆలయాల్లో స్వామి వారి నగలకు భద్రత లేదంటూ దేవాలయం ముందు నిరసనకు దిగారు. కిరీటాల మాయంపై సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని, టీటీడీ అనుబంధ ఆలయాల్లో భద్రతను పటిష్టం చేయాలని బీజేపీ నేత భానుప్రకాశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
తప్పైపోయింది క్షమించండి: మంత్రి సోమిరెడ్డి
సాక్షి, విజయవాడ: తిరుమల శ్రీవారి ఆభరణాల మాయంలో టీడీపీ పెద్దల ప్రమేయంపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఆరోపణలపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం భయపడుతున్నట్లు తేటతెల్లమైంది. ‘‘రమణదీక్షితులుని బొక్కలో వేసి నాలుగు తగిలిస్తే నిజాలు బయటికొస్తాయి..’’అన్న మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. 24 గంటలు తిరక్కముందే.. ‘‘తప్పుగా మాట్లాడాను క్షమించండి..’’ అని వేడుకున్నారు. ఆదివారం విజయవాడలో ప్రారంభమైన టీడీపీ మహానాడులో ఆయన మాట్లాడారు. అదే తెలంగాణలో అయితే ఇంటరాగేషన్ చేసేవారే: ‘‘రమణదీక్షితులు గారిని ఉద్దేశించి అన్న మాటలకు క్షమాపణలు చెబుతున్నాను. బ్రాహ్మణుల ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉండాలని కోరుకునే వ్యక్తిని నేను. అందుకే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను. నిజానికి నేను ప్రతిపక్షం వారిని విమర్శించాలనుకుని రమణదీక్షితులును అనేశాను. అయినా, ముఖ్యమంత్రి ఇంట్లో శ్రీవారి నగలు ఉన్నాయని ఎవరైనా ఆరోపిస్తే.. తెలంగాణలో అయితే ఖచ్చితంగా బొక్కలోవేసి ఇంటరాగేషన్ చేసేవారు. అసలు వేంకటేశ్వర స్వామి నగల గురించి మాట్లాడినందుకు శిక్షించేవారు..’’ అని సోమిరెడ్డి అన్నారు. తద్వారా ఈ వ్యవహారంలో దర్యాప్తు ఉండబోదని టీడీపీ మరోసారి వెల్లడించింది. వెంకన్న చౌదరి.. రమణదీక్షితులు ఎవరు?: శ్రీవారి ఆభరణాల మాయం వ్యవహారం గుట్టురట్టైన దగ్గర్నుంచి టీడీపీ నేతల్లో ఆందోళన తీవ్రస్థాయికి చేరడం చూస్తూనేఉన్నాం. టీడీపీ ఎంపీ మురళీమోహన్ ఏకంగా దేవుడికి కులాన్ని ఆపదిస్తూ ‘వెంకన్న చౌదరి’ అని, ఆ తర్వాత నోరుజారానని చెప్పుకొచ్చారు. అంతలోనే మంత్రి సోమిరెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ‘ఎవరా రమణదీక్షితులు.. బొక్కలోవేసి నాలుగు తగిలిస్తే నిజాలు బయటికొస్తాయి’అని అన్నారు. సోమిరెడ్డి వ్యాఖ్యలపై బ్రాహ్మణ సంఘాలతోపాటు పలు వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో చివరికి వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ క్షమాపణలు చెప్పారు. -
అడ్డంగా బుకాయింపు
ఏలూరు టౌన్ : ఏలూరులోని ఒక బంగారు వ్యాపారి కుమార్తెను మోసం చేసి, బెదిరించి, భయపెట్టి భారీగా బంగారు ఆభరణాలు గుంజేసిన జనసేన కార్యకర్తలను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి, జైలుకు పంపారు. జనసేన పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో జనసేన పార్టీ సేవాదళ్ సమన్వయకర్తగా సింహాద్రి బాలు నియమితుడయ్యారు. ఈ కేసులో దత్తి బాలాజీ, సింహాద్రి బాలచందర్ అలియాస్ బాలు, పిల్లా సాయి దేవేంద్రనాయుడు కీలకవ్యక్తులుగా ఉన్నారు. వీరంతా తొలుత పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ పేరుతో పుట్టినరోజు వేడుకలు, సినిమా రిలీజ్ ఫంక్షన్లు పెద్దెత్తున చేస్తూ ప్రచారం పొందారు. అనంతరం జనసేన పార్టీ ప్రారంభమైన నాటి నుంచి యూత్, విద్యార్థులను సమీకరిస్తూ పార్టీ కోసం పనిచేసినట్లు తెలుస్తోంది. ఇదంతా ఇలా ఉంటే పార్టీ సేవాదళ్ జిల్లా కోఆర్డినేటర్ మారిశెట్టి పవన్ బాలాజీ, కొప్పిశెట్టి వీరబాబు, పార్టీ నాయకులు సాగర్‌బాబు, జల్లా హరికృష్ణ శనివారం హడావుడిగా విలేకరుల సమావేశం నిర్వహించారు. యువతిని మోసం చేసిన కేసులో నిందితులుగా పోలీసుల విచారణలో నిర్ధారణ అయిన సింహాద్రి బాలు, దత్తి బాలాజీ, దేవేంద్రనాయుడు తదితరులకు జనసేన పార్టీతో ఏ విధమైన సంబంధాలు లేవని, అసలు పార్టీ సభ్యులుగా కూడా లేరని ప్రకటించారు. జనసేన నుంచి బాలుకు వచ్చిన అధికారిక పత్రం ఈ ప్రకటనపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఏలూరులో గతేడాది నవంబర్‌లో జనసేన ఔత్సాహికుల వేదికలో పార్టీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ హరిప్రసాద్, ఇతర రాష్ట్ర ముఖ్యనేతల సమావేశాల్లోనూ బాలు వారి వెన్నంటే ఉన్నాడు. అతడు పార్టీకి సంబంధించిన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తే నాయకులు హాజరయ్యారు. ధర్నాలు, రాస్తారోకోలు, ప్రదర్శనల్లోనూ నాయకుల వెంట నిందితులంతా పాల్గొన్న సందర్భాలు అనేకం ఉన్నాయి. బుకాయింపుపై సర్వత్రా విమర్శలు ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ కార్యకర్తలపై కేసులు నమోదైన వెంటనే అసలు పార్టీ కార్యకర్తలే కాదంటూ బుకాయించటాన్ని పార్టీలోని యువత, కొందరు నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. తప్పు చేస్తే నాయకులైనా, కార్యకర్తలైనా పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందని ప్రకటించకుండా మా పార్టీకేమీ సంబంధం లేదని, అంతా మీడియా సృష్టేనంటూ అపవాదు మోపటంపైనా భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. పోలీసులు పదిరోజులు దర్యాప్తు చేసి, విచారణలో వెల్లడైన విషయాలను ఏకంగా జిల్లా ఎస్పీ రవిప్రకాష్ వెల్లడిస్తే ఆ విషయాలపైనా పార్టీ నేతలు కామెంట్లు చేయటంపై పార్టీలోని కొందరు నాయకులే పెదవివిరుస్తున్నారు. పోలీస్ అధికారులు పదిరోజులు దర్యాప్తు చేసిన అనంతరం, కేసులో నిందితులను సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేశారు. స్వయంగా ఎస్పీ రవిప్రకాష్, విచారణ చేసిన ఏలూరు డీఎస్పీ ఈశ్వరరావు మీడియాకు వివరాలు వెల్లడించారు. జనసేన కార్యకర్తలుగా చెప్పుకుంటూ మోసాలకు పాల్పడుతున్నట్టు వివరాలు తెలిపారు. కానీ జనసేన పార్టీకి చెందిన కొందరు నేతలు పోలీసులను, మీడియాను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయటంపై పార్టీలోని కొందరు నాయకులే వ్యతిరేకిస్తున్నారు. తప్పుచేస్తే శిక్ష తప్పదని, చట్టానికి ఎవరైనా ఒక్కటేనని, కానీ జనసేన పార్టీలో జెండా మోస్తే చివరికి దక్కే ఫలితం ఇదేనా అంటూ కార్యకర్తలు కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మోసగించిన ముఠాతో జనసేనకు సంబంధం లేదు ఏలూరు (ఆర్ఆర్ పేట) : ఇటీవల జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టించిన యువతులను మోసగించి బంగారు ఆభరణాలు తీసుకుని జల్సాలు చేసి పోలీసులకు పట్టుబడిన ముఠాకి జనసేన పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ఆ పార్టీ సేవాదళ్ జిల్లా కన్వీనర్ మారిశెట్టి పవన్ బాలాజీ స్పష్టం చేశారు. వి విలేకరుల సమావేశంలో మాట్లాడుతోన్న పవన్ బాలాజీ శనివారం స్థానిక రెవెన్యూ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ సంఘ విద్రోహశక్తులను, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితిల్లోనూ ప్రోత్సహించదన్నారు. ఈ కార్యక్రమంలో పి.సాగర్‌బాబు, జల్లా హరికృష్ణ పాల్గొన్నారు. -
హ్యాండ్ బ్యాగ్‌లో నగల చోరీ
కోవూరు : కుటుంబ సభ్యులందరూ గాఢనిద్రలో ఉండగా దుండగలు ఇంట్లోని హ్యాండ్ బ్యాగ్‌లోని వస్తువులు అపహరించారు. ఈ సంఘటన కోవూరు మండలంలోని చిన్నపడుగుపాడు నాగల కట్ట వద్ద బుధవారం తెల్లవారు జామున జరిగింది. బాధితుల కథనం మేరకు.. మంగళవారం అర్ధరాత్రి 12.30 గంటల వరకు కుటుంబ సభ్యులందరూ మేలుకొని ఉన్నారు. బుధవారం ఉదయం నిద్రలేచి చూసే సరికి హ్యాండ్ బ్యాగ్‌లోని వస్తువులు అపహరణకు గురైన విషయాన్ని గుర్తించారు. బ్యాగ్‌లో పది సవర్ల బంగారు ఆభరణాలు, ఏటీఎం కార్డు, రూ.14 వేలు విలువ చేసే సెల్‌ఫోన్, రూ.5 వేలు నగదు ఉందని, బాధితురాలు ఎస్కే హఫిజిన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఎంటీఎం కార్డును బ్లాక్ చేశామన్నారు. ఎస్ఐ వెంకట్రావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఐడీ పార్టీ సిబ్బంది విజయప్రసాద్, కృష్ణ, సత్యం చోరీ జరిగిన ఇంటి పరిసరాల్లో గాలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
షిరిడీ ఆలయంలో చోరీ.. గార్డు అరెస్టు
షిరిడీ సాయి సంస్థానంలో వెండి, బంగారు ఆభరణాలను దొంగిలించిన నేరంలో సంస్థాన్ సెక్యూరిటీ గార్డు ఒకరిని అరెస్టు చేశారు. ట్రస్టుకు చెందిన కౌంటింగ్ హాలు నుంచి అతడీ ఆభరణాలను దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం నాడు నిర్వహించిన తనిఖీలలో.. దినకర్ హనుమంత్ డోఖే (58) అనే సెక్యూరిటీ గార్డు ఒక గ్రాము బంగారు నాణెం, మూడు గ్రాముల బంగారు ఆభరణాలు, 36 గ్రాముల వెండి ఆభరణాలను కౌంటింగ్ హాలు నుంచి దొంగిలించినట్లు ఇన్స్పెక్టర్ సందీప్ కహాలే తెలిపారు. ట్రస్టు ఆస్పత్రిలో పనిచేసే ఈ గార్డును మంగళవారం రాత్రి అరెస్టు చేశామని, అతడిపై ఐపీసీ సెక్షన్ 379 కింద కేసు నమోదు చేశామని చెప్పారు. ఈ సంఘటన అనంతరం గార్డు ఉద్యోగం నుంచి డోఖేను సంస్థానం సస్పెండ్ చేసినట్లు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అప్పా సాహెబ్ షిండే తెలిపారు.