టీటీడీ దేవస్థానంలో నగలు మాయమవుతున్నాయని అనేక ఫిర్యాదులు వచ్చినా ఏపీ సర్కారు విచారణ జరిపించకపోవడంపై వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతిలోని గోవిందరాజు స్వామి ఆలయంలో ఉత్సవమూర్తులకు అలంకరించే మూడు బంగారు కిరీటాలు మాయం కావడం సంస్కృతి, సాంప్రదాయాలకు తీవ్ర విఘాతం కలగడమేనన్నారు.